Asianet News TeluguAsianet News Telugu

గుజరాత్ ప్రజలకు దీపావళి కానుక.. 27వ తేదీ వరకు ట్రాఫిక్ ఉల్లంఘనలపై ఫైన్లు మినహాయింపు..

దీపావళి పండగ సందర్భంగా గుజరాత్ ప్రజలకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలపై మినహాయింపులు ఇచ్చింది. అక్టోబర్ 21-27 వరకు పొరపాటున ట్రాఫిక్ రూల్స్ పాటించకపోయినా ఫైన్లు విధించబోమని తెలిపింది. 

As a Diwali gift to the people of Gujarat, traffic fines are waived from 21-27.
Author
First Published Oct 22, 2022, 6:56 AM IST

అక్టోబర్ 21 నుండి అక్టోబర్ 27 వరకు రాష్ట్రంలో ఎలాంటి ట్రాఫిక్ సంబంధిత ఉల్లంఘనలకు జరిమానా విధించబోమని గుజరాత్ ప్రభుత్వం తెలిపింది. గుజరాత్ హోం మంత్రి హర్ష్ సంఘవి దీనిని శుక్రవారం ప్రకటించారు. అయితే ఉత్తర భారతదేశంలో వారం రోజుల పాటు ఘనంగా జరుపుకునే దీపావళి పండగ నేపథ్యంలో ప్రభుత్వం ఈ విధంగా చర్యకు పూనుకుంది. 

కేసులను జాబితా చేయకపోవడంపై సీజేఐ ఆగ్రహం.. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని వార్నింగ్

వారం రోజుల పాటు జరిమానాలు రద్దు చేయడం వల్ల ప్రజలు ట్రాఫిక్ నిబంధనలను పట్టించుకోనవసరం లేదని, వాటిని ఉల్లంఘించాలని అర్థం కాదని మంత్రి సంఘవి ఈ సందర్భంగా తెలిపారు. అయితే ఎవరైనా పొరపాటున లేదా అనుకోకుండా ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తేనే జరిమానా చెల్లించాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టతనిచ్చారు.

ప్రమాదంలో ప్రజాస్వామ్యం.. రాజ్యాంగ వ్యవస్థలపై కేంద్రం దాడి : మల్లికార్జున్ ఖర్గే

గుజరాత్‌లో ట్రాఫిక్‌ జరిమానాలు
గుజరాత్ రాష్ట్రంలో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి అక్కడి ప్రభుత్వం భారీగానే జరిమానాలు విధిస్తుంది. మద్యం తాగి వాహనాలు నడిపితే రూ. 10,000 నుంచి 6 నెలల వరకు జైలు శిక్ష, తక్కువ వయసులో వాహనాలు నడిపితే రూ. 25,000 లేదా 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధిస్తారు. ట్రాఫిక్ లైట్ ఉల్లంఘనకు సాధారణ రోజుల్లో రూ. 1000 నుండి రూ. 5000 వరకు ఫైన్ వేస్తారు. 

ఉగ్రవాదాన్ని రాజకీయ సమస్యగా పరిగణించలేం.. వచ్చే 50 ఏళ్లకు ఇంటర్‌పోల్ ప్రణాళికలు..

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు 2 నెలల కంటే తక్కువ సమయం ఉంది. ఈ నేపథ్యంలో దీపావళి పండగను పురస్కరించుకొని ఈ ప్రకటన వెలువడినట్టు తెలుస్తోంది. గుజరాత్ పౌరులను తమవైపే ఉంచుకోవడానికి బీజేపీ ప్రభుత్వం ఈ విధమైన ప్రకటన చేసింది. కాగా.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సొంత రాష్ట్రమైన గుజరాత్ ఇప్పుడు 2 దశాబ్దాలకు పైగా పాలనను పట్టుకుని కొనసాగిస్తున్న బీజేపీకి కంచుకోటగా ఉంది. 

ప్రధాని మోడీ స్వయంగా 2001 నుండి 2014 వరకు గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేశారు, ఆ తర్వాత ఆయన దేశానికి ప్రధానమంత్రి అయ్యారు. అత్యధిక మెజారిటీతో రెండుసార్లు విజయవంతంగా ప్రధాని పదవిని అధిష్టించారు. ఇదిలా ఉండగా.. ఈ నెల ప్రారంభంలో ఎన్నికల సంఘం గుజరాత్ షెడ్యూల్‌ను నిలిపివేస్తూ హిమాచల్ ప్రదేశ్‌కు పోలింగ్ తేదీని ప్రకటించింది. అయితే గుజరాత్‌లో నవంబర్ లేదా డిసెంబర్‌లో ఓటింగ్ జరిగే అవకాశం ఉంది.
 

Follow Us:
Download App:
  • android
  • ios