భారత్‌లో కరోనా కేసుల్లో పెరుగుదల మరోసారి కనిపిస్తుంది. ఒక్క రోజు వ్యవధిలోనే దేశంలో 700 కంటే పైగా కరోనా కేసులు నమోదయ్యాయి.
భారత్‌లో కరోనా కేసుల్లో పెరుగుదల మరోసారి కనిపిస్తుంది. ఒక్క రోజు వ్యవధిలోనే దేశంలో 700 కంటే పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. వివరాలు.. దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 754 కరోనా కేసులు నమోదైనట్టుగా కేంద్ర ఆరోగ్య మంతిత్వ శాఖ గురువారం ఉదయం వెల్లడించిన డేటాలో పేర్కొంది. దీంతో దేశంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 4.46 కోట్లకు (4,46,92,710) చేరుకుంది. అయితే నాలుగు నెలల విరామం తర్వాత దేశంలో అత్యధిక కరోనా కేసులు నమోదైనట్టుగా అయింది. గతేడాది నవంబర్ 12న దేశంలో 734 కరోనా కేసులు నమోదయ్యాయి.
కరోనాతో తాజాగా కర్ణాటకలో ఒకరు మరణించారు. దీంతో దేశంలో కరోనాతో ఇప్పటివరకు చోటుచేసుకున్న మరణాల సంఖ్య 5,30,790కి పెరిగింది. తాజా కరోనా కేసులతో.. ప్రస్తుతం దేశంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 4,623 కి చేరుకుంది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్ ప్రకారం.. మొత్తం ఇన్‌ఫెక్షన్‌లలో యాక్టివ్ కేసులు 0.01 శాతంగా ఉన్నాయి. అలాగే కరోనా రికవరీ రేటు 98.80 శాతంగా నమోదైంది. కరోనా మరణాల రేటు.. 1.19 శాతంగా ఉంది. ఇక, ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,41,57,297 కు పెరిగింది.
ఇక, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్ ప్రకారం.. దేశవ్యాప్తంగా కోవిడ్ -19 వ్యాక్సినేషన్ డ్రైవ్ కింద ఇప్పటివరకు దేశంలో 220.64 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్‌లు అందించబడ్డాయి.
