బీజేపీకి నటి గౌతమి గుడ్ బై.. కారణమేంటంటే ?
తమిళనాడులో బీజేపీ సీనియర్ నాయకురాలైన నటి గౌతమి పార్టీకి రాజీనామా చేశారు. తన ఆస్తులను లాక్కున్న వ్యక్తికి పార్టీ అండగా నిలబడుతోందని ఆమె ఆరోపించారు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆమె వివరించారు.
బీజేపీకి నటి గౌతమి తాడిమల్ల బీజేపీకి గుడ్ బై చెప్పారు. తన ఆస్తులను కొల్లగొట్టిన వ్యక్తికి పార్టీ సీనియర్లు సహకరిస్తున్నారని ఆరోపిస్తూ ఆమె తన సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని ఆమె తన ఎక్స్ (ట్విట్టర్) పోస్టులో వెల్లడించారు. తాను గత 25 సంవత్సరాలుగా బీజేపీ సభ్యురాలిగా ఉన్నానని, చిత్తశుద్ధితో పనిచేశానని చెప్పారు.
జమ్మూ కాశ్మీర్ లో భూకంపం.. రిక్టర్ స్కేల్ పై 3.5 తీవ్రత నమోదు..
సి.అళగప్పన్ అనే వ్యక్తి 20 ఏళ్ల క్రితం తనతో స్నేహం చేశాడని, అతడికి తన ఆస్తుల నిర్వహణ బాధ్యతలు అప్పగించానని గౌతమి పేర్కొన్నారు. తన భూముల అమ్మకం బాధ్యతను ఆయనకు అప్పగించానని, ఈ మధ్యనే అతను తనను మోసం చేశాడని తెలుసుకున్నానని చెప్పారు. తనను, తన కూతుర్ని కుటుంబంలో ఒక భాగంగా ఆహ్వానించినట్లు నటిస్తూనే ఈ మోసానికి పాల్పడ్డారని ఆరోపించారు.
సుదీర్ఘ న్యాయపోరాటం జరుగుతుండగానే పార్టీ తనకు మద్దతివ్వలేదని, కొందరు సీనియర్ సభ్యులు అళగప్పన్ కు సహకరిస్తున్నారని తెలిసి తాను చలించిపోయానని ఆమె పేర్కొన్నారు. ఎఫ్ఐఆర్ లు నమోదైన తర్వాత కూడా గత 40 రోజుల నుంచి అళగప్పన్ కు న్యాయం జరగకుండా బీజేపీకి చెందిన పలువురు సీనియర్ సభ్యులు అడ్డుకుంటున్నారని ఆరోపించారు.
సీఎం ఎంకే స్టాలిన్, పోలీసు శాఖ, న్యాయవ్యవస్థ తనకు కావాల్సిన న్యాయం అందిస్తాయన్న నమ్మకం తనకు ఇంకా ఉందని తెలిపారు. భరించలేని బాధతో బీజేపీకి రాజీనామా చేశానని, అయితే ఒంటరి మహిళగా, ఒంటరి తల్లిగా తనకు, తన కుమార్తె భవిష్యత్తుకు న్యాయం కోసం పోరాడుతున్నందున.. దృఢ నిశ్చయంతో తాను బీజేపీకి రాజీనామా చేశానని గౌతమి పేర్కొన్నారు.