జమ్మూ కాశ్మీర్ లో భూకంపం.. రిక్టర్ స్కేల్ పై 3.5 తీవ్రత నమోదు..
జమ్మూ కాశ్మీర్ లో ఆదివారం రాత్రి భూకంపం వచ్చింది. కిష్త్వార్ జిల్లాలో రాత్రి 10.56 గంటలకు భూ ప్రకంపనలు వచ్చాయి. రిక్టర్ స్కేల్ పై దీని తీవ్రత 3.5 గా నమోదు అయ్యింది.
జమ్మూకాశ్మీర్ లోని కిష్త్వార్ జిల్లాలో ఆదివారం రాత్రి భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 3.5గా నమోదైంది. పరిసర ప్రాంతాల్లో కూడా ప్రకంపనలు వచ్చినట్లు సమాచారం. నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ ప్రకారం.. కిష్త్వార్ జిల్లాలో 5 కిలో మీటర్ల లోతులో, భారత కాలమానం ప్రకారం 10.56 గంటలకు భూకంపం వచ్చింది.
భూ ప్రకంపనలతో ఆ ప్రాంతంలో భయాందోళనలు నెలకొన్నాయి. భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణనష్టం, ప్రాణనష్టం సంభవించలేదు. కాగా.. 24 గంటల వ్యవధిలో హిమాలయ ప్రాంతాల్లో సంభవించిన రెండో భూకంపం ఇది. ఆదివారం ఉదయం 7.39 గంటలకు కూడా నేపాల్ లో 6.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. రాజధాని ఖాట్మండుకు పశ్చిమాన 55 కిలోమీటర్ల దూరంలో ఉన్న ధాడింగ్ వద్ద భూకంప కేంద్రాన్ని గుర్తించినట్టు నేపాల్ నేషనల్ ఎర్త్ మిక్ మానిటరింగ్ అండ్ రీసెర్చ్ సెంటర్ తెలిపింది. దీని వల్ల ఉత్తర్ ప్రదేశ్, బిహార్, ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతాల్లో భూ ప్రకంపనలు సంభవించాయి.