షట్లర్ సైనా నెహ్వాల్‌ సైనా నెహ్వాల్‌ను (Saina Nehwal) విమర్శిస్తూ నటుడు సిద్దార్థ్ (actor Siddharth) చేసిన ట్వీట్‌పై పలువరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై జాతీయ మహిళ కమిషన్ కూడా సీరియస్‌గా స్పందించింది. ఇందుకు సంబంధించి కేంద్ర కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ (Rajeev Chandrasekhar) కూడా స్పందించారు. ఆన్‌లైన్‌లో చట్టాలను ఉల్లంఘించే వారు తగిన పర్యవసానాలను ఎదుర్కోవలసి ఉంటుందని హెచ్చరించారు. 

నటుడు సిద్దార్థ్ (actor Siddharth) మరో వివాదంలో చిక్కుకున్నాడు. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే.. షట్లర్ సైనా నెహ్వాల్‌ను (Saina Nehwal) విమర్శిస్తూ చేసిన ట్వీటే ఇందుకు కారణం. సిద్దార్థ్ చేసిన ఈ ట్వీట్‌పై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది, గాయని చిన్మయి శ్రీపాద సహా పలువురు.. సిద్దార్థ్ తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఇందుకు సంబంధించి జాతీయ మహిళ కమిషన్ కూడా సిద్దార్థ్‌కు నోటీస్ పంపింది. ఈ ఘటనకు సంబంధించి విచారణ జరిపి, ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని మహారాష్ట్ర డీజీపీకి లేఖ రాసింది. సిదార్థ్ ట్విట్టర్ అకౌంట్‌ను బ్లాక్ చేయాలని ట్విట్టర్‌ ఇండియకు లేఖ రాయడంతో పాటుగా.. అలాంటి కామెంట్స్ చేసినందుకు చర్యలు తీసుకోవాలని కోరింది. 

వివరాలు.. ఇటీవల ప్రధాన నరేంద్ర మోదీ (Narendra Modi) పంజాబ్ పర్యటనలో చోటుచేసుకున్న భద్రతా వైఫల్యం తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. పలువరు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా తమ ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ షట్లర్ సైనా నెహ్వాల్ కూడా మోదీకి మద్దతుగా ఓ ట్వీట్ చేశారు. ‘తమ ప్రధాని భద్రత విషయంలో రాజీ పడితే ఏ దేశం కూడా సురక్షితంగా ఉందని చెప్పుకోదు. అత్యంత బలమైన మాటల్లో చెప్పాలంటే.. ప్రధాని మోదీపై అరాచకవాదులు చేసిన పిరికి దాడిని నేను ఖండిస్తున్నాను’ అని సైనా నెహ్వాల్ పేర్కొన్నారు. 

అయితే సైనా నెహ్వాల్ ట్వీట్‌పై స్పందించిన హీరో సిద్దార్థ్ అభ్యంతరకర పదజాలం వినియోగించారు. భారతదేశానికి రక్షకులు ఉన్నందుకు దేవుడికి ధన్యవాదాలు.. షేమ్ ఆన్ యూ #Rihanna అని సిద్దార్థ్ పేర్కొన్నాడు. అయితే ట్వీట్‌లో సిదార్థ్ Subtle cock అనే పదం ఉపయోగించడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అతడు ఉపయోగించిన పదాలు అభ్యంతరకరంగా మండిపడుతున్నారు.

సిద్దార్థ్ చేసిన కామెంట్స్‌పై సైనా నెహ్వాల్ కూడా స్పందించారు. ఓ మీడియా సంస్థతో మాట్లాడిన సైనా.. ‘అతను (సిద్ధార్థ్) ఏమి చెప్పాడో నాకు ఖచ్చితంగా తెలియదు. నటుడిగా నేను అతన్ని ఇష్టపడతాను. కానీ ఇది మంచిది కాదు. అతను మంచి పదాలతో తన భావాలను వ్యక్తపరచవచ్చు. కానీ అది ట్విట్టర్. మీరు అలాంటి పదాలు, వ్యాఖ్యలను గుర్తిస్తారు’ అని పేర్కొంది.

Scroll to load tweet…

సైనా నెహ్వాల్ స్పందనను జర్నలిస్ట్ Shivani Gupta తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేయగా.. కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ (Rajeev Chandrasekhar) స్పందించారు. ఎప్పుడైతే అనైతిక వ్యక్తులు తగ్గుతారో.. నిజమైన ఛాంపియన్‌లు పైకి వెళ్తారని పేర్కొన్నారు. శక్తిని ఎల్లప్పుడు ఉంచుకోండని సైనా నెహ్వాల్‌కు చెప్పారు. ఆన్‌లైన్‌లో చట్టాలను ఉల్లంఘించే వారు తగిన పర్యవసానాలను ఎదుర్కోవలసి ఉంటుందని హెచ్చరించారు. 

Scroll to load tweet…

అయితే పెద్ద ఎత్తున్న విమర్శలు వస్తున్న నేపథ్యంలో సిద్దార్థ్ స్పందించారు. తాను ఎవరిని అగౌరవపరపరచాలని అనుకోవడం లేదని ట్వీట్ చేశారు. తన ట్వీట్‌లో చెడు ఉద్దేశం లేదని అన్నారు.