బిహార్‌లో ఓ కాల్పుల కేసులో నిందితులను అరెస్టు చేయడానికి వెళ్లారు. కానీ, పోలీసులను చూడగానే నిందితులు కాల్పులు జరిపి పారిపోయారు. కాగా, అక్కడే ఉన్న వారి భార్యలను పోలీసులు అరెస్టు చేశారు.

న్యూఢిల్లీ: బిహార్‌లో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. బిహార్‌లో ఓ చోట గురువారం కాల్పులు జరిగాయి. ఆ కేసుకు సంబంధించి పోలీసులు కొందరు నిందితుల ఆచూకీ కనుక్కుని రైడ్ చేశారు. కానీ, పోలీసుల రాకను గమనించిన వారు వెంటనే కాల్పులు జరిపారు. పోలీసులు తేరుకునే లోపు స్పాట్ నుంచి పారిపోయారు. కాగా, పోలీసులు స్పాట్‌లో ఉన్న ఆ నిందితుల భార్యలను అరెస్టు చేశారు. ఈ ఘటన బిహతా పోలీసు స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది.

బిహతా పోలీసు స్టేషన్ పరిధిలోని ఆమ్నాబాద్‌లో ఓ ఇంటిపై పోలీసులు రైడ్ చేసినట్టు పోలీసులు తెలిపారు. పోలీసు బృందాన్ని చూడగానే శ్రీ రాయ్, ఆయన ఇద్దరు కొడుకులు ప్రవీణ్ కుమార్, నవీన్ కుమార్‌లు, మరో కజిన్ గోపాల్ రాయ్‌లు పారిపోయారని వివరించారు.

కాగా, అదే ప్రాంతంలో పరారైన నిందితుల భార్యలు కనిపించారని పోలీసులు తెలిపారు. నిందితులు పారిపోవడానికి వారి భార్యలు సహకరించారని బిహార్ పోలీసులు ఓ ప్రకటనలో ఆరోపించారు. 

శ్రీ రాయ్ భార్య లక్ష్మినియా దేవి, ప్రవీణ్ భార్య వినీతా దేవీ, నవీన్ భార్య మున్ని కుమారిలను అరెస్టు చేసినట్టు తెలిపారు. 

కాగా, పోలీసుల కాల్పుల్లో ఎవరూ గాయపడలేదని పోలీసులు వివరించారు.

స్పాట్‌లో ఓ కంట్రీ మేడ్ పిస్టల్, ఐదు లైవ్ కార్టిరిడ్జ్‌లు దొరికాయని పేర్కొన్నారు. పోలీసులు ఓ కేసు నమోదు చేసుకుని గాలింపులు జరుపుతున్నట్టు వివరించారు.

ఇటీవలి కాలంలో ఇసుక అక్రమ రవాణా పై చాలా కథనాలు వచ్చాయి. దేశవ్యాప్తంగా ఇలాంటి నేరాలు సర్వసాధారణమైపోయాయి. బిహార్‌లో వెలుగులోకి వచ్చిన ఓ చిన్న ఘటన కలకలం రేపుతున్నది. ఇసుక అక్రమ రవాణాపై రెండు ముఠాల మధ్య వాగ్వాదం జరిగింది. చిన్నపాటి ఘర్షణ జరిగింది. అది తీవ్రరూపం దాల్చింది. ఏకంగా కాల్పుల వరకూ దారి తీసింది. ఇలా కాల్పులు జరిగిన ఘటనలో నలుగురు మరణించారు.

బిహార్‌లోని సోన్ నది నుంచి అక్రమంగా ఇసుకను తరలించడంపై రెండు ముఠాల మధ్య గొడవ జరిగింది. అనంతరం జరిగిన కాల్పుల్లో నలుగురు స్పాట్‌లోనే మరణించారు. ఈ విషయం పోలీసులకు తెలిసింది. వారు స్పాట్‌కు చేరుకున్నారు. కేసును టేకప్ చేశారు. దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన బిహార్‌లోని బిహతా టౌన్‌లో చోటుచేసుకుంది.