పాలిటెక్నిక్ పరీక్షలో ఫెయిల్ అయిన యువతి రీకౌంటింగ్ కు దరఖాస్తు చేసుకున్ననాటి నుంచి ఆమెకు అసభ్యకరమైన మెసేజ్ లు రావడం ప్రారంభమైంది. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. గుర్తు తెలియని దుండగుడిపై ఫిర్యాదు చేసింది.
ఓ యువతి పరీక్షలో ఫెయిల్ అయ్యింది. దీంతో రీకౌంటింగ్ కు దరఖాస్తు చేసుకుంది. అప్పటి నుంచి ఆమె మొబైల్ నెంబర్ కు అసభ్యకరమైన మెసేజ్ లు వస్తున్నాయి. తనకు గర్ల్ ఫ్రెండ్ గా మారాలని, అలా చేస్తేనే పరీక్షలో పాస్ చేస్తానని అందులో ఓ దుండగుడు బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. రూ.5 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. తీవ్ర మానసిక ఆందోళనకు గురైన యువతి పోలీసులను ఆశ్రయించింది.
రోజుకు రూ. 400 సంపాదించే కూలీకి ఐటీ అధికారుల షాక్.. రూ. 14 కోట్లు పన్ను కట్టాలని నోటీసులు..
ఉత్తరప్రదేశ్ కు చెందిన యువతికి ఈ వింత ప్రతిపాదన వచ్చింది. కాన్పుర్ లోని గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీలో ఓ యువతి చదువుకుంటోంది. అయితే కొంత కాలం కిందట ఆమె పాలిటెక్నిక్ పరీక్షలు రాసింది. కానీ ఆమె ఫెయిల్ అయ్యింది. మ్యాథ్స్ సబ్జెక్ట్ తప్పింది. అందులో ఆమెకు కేవలం 11 మార్కులే వచ్చాయి. దీంతో ఆమె తన మార్కులను పున:పరిశీలించాలని రీకౌంటింగ్ కు దరఖాస్తు చేసుకుంది.
4 కేజీల గంజాయితో పట్టుబడిన ముగ్గురు టెక్కీలు.. అంతా 25 ఏళ్లలోపు వారే.. ఎక్కడంటే ?
అయితే అప్పటి నుంచి ఆమె మొబైల్ కు గుర్తు తెలియని నెంబర్ల నుంచి మెసేజ్ లు రావడం ప్రారంభమైంది. తనకు గర్ల్ ఫ్రెండ్ గా మారాలని, అయితేనే పాస్ చేస్తానని, లేకపోతే ఫెయిల్ చేస్తానంటూ అసభ్యకరంగా మెసేజ్ లు వచ్చేవి. దీంతో రూ.5 వేలు కూడా ఇవ్వాలని కోరేవాడు. ఈ ప్రాతిపాదనలకు ఆ యువతి నిరాకరించింది. దీంతో అతడు పలు నెంబర్ల నుంచి కాల్స్ చేయడం ప్రారంభించాడు. మళ్లీ మెసెజ్ లు చేస్తూ ఆమెను మానసిక ఆందోళనకు గురి చేసేవాడు. దీంతో బాధితురాలి పోలీసులను ఆశ్రయించింది.
వార్నీ.. పేషెంట్ బాధతో అల్లాడిపోతున్నాడని మద్యం తాగించిన అంబులెన్స్ డ్రైవర్.. సోషల్ మీడియాలో వైరల్
తనకు వస్తున్న మెసేజలను చూపిస్తూ, వాటి వల్ల తాను ఎదుర్కొంటున్న ఇబ్బందులను పోలీసులకు వివరించింది. ఆ దుండగుడిపై ఫిర్యాదు చేసింది. కాగా.. ఈ సమయంలోనే రీకౌంటింగ్ ఫలితాలు కూడా వచ్చాయి. అందులోనూ ఆ యువతి ఫెయిల్ అయినట్టు వచ్చింది. అంతకు ముందు వచ్చిన ఫలితాల్లో మ్యాథ్స్ లో 11 మార్కులు వచ్చినా.. కొత్తగా వచ్చిన రీకౌంటింగ్ ఫలితాల్లో సున్నా మార్కులు వచ్చాయి. ఇలా రావడం వెనుక తనకు కాల్ చేసిన వ్యక్తి ఉన్నాడని ఆ యువతిక పోలీసులకు తెలియజేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
