విషాదం నింపిన రైలు ప్రమాదం.. చివరి క్షణంలో ఆగి, కుటుంబం మొత్తాన్ని కోల్పొయి ఒంటరిగా మిగిలిన యువకుడు..
ఒడిశా రైలు ప్రమాదంలో కుటుంబ మొత్తాన్ని కోల్పొయి ఒంటరిగా మిగిలిన ఓ యువకుడి ధీనగాథ అందరినీ కంటతడి పెట్టిస్తోంది. ఈ రైలు ప్రమాదంలో అతడి తన భార్య, అత్త, బావమరిది చనిపోయారు. దీంతో ఆ యువకుడు ఇప్పుడు ఒంటరివాడయ్యాడు.

బాలేశ్వర్ కు చెందిన ఆ యువకుడికి పెళ్లై ఏడాది అయ్యింది. భార్య అనారోగ్యానికి గురికావడంతో కటక్‌లోని హాస్పిటల్ కు తీసుకెళ్లారు. అక్కడి డాక్టర్లు ఆమెకు ఆపరేషన్ నిర్వహించారు. దీంతో తన భార్యను తీసుకొని అతడు ఇంటికి వచ్చాడు. ఆపరేషన్ అనంతరం మళ్లీ ఒక సారి హాస్పిటల్ కు రావాలని డాక్టర్లు సూచించడంతో అక్కడికి వెళ్లేందుకు అన్ని సిద్ధం చేసుకున్నాడు. కటక్ వెళ్లేందుకు భార్యకు తోడుగా తన అత్త, బావమరిదిని తీసుకెళ్లాలని వారందరికీ ట్రైన్ టిక్కెట్లు బుక్ చేశాడు. కానీ ఆ యువకుడికి చివరి క్షణంలో అత్యవసర పని రావడంతో ట్రైన్ ఎక్కలేదు. అయితే బాలేశ్వర్ నుంచి బయలుదేరిన ఆ ట్రైన్ కొంత సమయానికి ప్రమాదానికి గురైంది. ఇందులో తన కుటుంబ సభ్యులందరినీ కోల్పోయి ఒంటరిగా మిగిలాడు.
ప్రముఖ రంగస్థల దర్శకుడు, నటుడు, బీజేపీ మాజీ నేత అమీర్ రజా హుస్సేన్ కన్నుమూత.. ప్రముఖుల నివాళి..
ఒడిశా రైలు ప్రమాదంలో అందరినీ కోల్పోయి ఒంటరిగా మిగిలిన గౌతమ్‌దాస్ ధీన గాథ ఇది. గౌతమ్ దాస్ కు ఏడాది కిందట విష్ణుప్రియదాస్ (22)తో వివాహం అయ్యింది. అయితే ఆమెకు ఇటీవల కటక్ లోని ఓ హాస్పిటల్ లో ఆపరేషన్ జరిగింది. ఆపరేషన్ జరిగిన కొన్ని రోజుల తరువాత హాస్పిటల్ కు వెళ్లాల్సి ఉంది. దీని కోసం విష్ణుప్రియదాస్ తల్లి ఝరుణాదాస్, సోదరుడు హిమాన్ష్‌దాస్ తో కలిసి గౌతమ్ దాస్ కటక్ వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అందరి కోసం గౌతమ్ దాస్ టిక్కెట్లు కూడా కొన్నారు. అయితే ఆయనకు అత్యవసర పని ఉండటంతో బాలేశ్వర్ లో నే ఉండిపోయారు. కుటుంబ సభ్యులందరినీ కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ఎక్కించారు.
'నితీష్, తేజస్విలు రాజీనామా చేస్తారా?': బీహార్ బ్రిడ్జి కుప్పకూలడంపై బీజేపీ విమర్శలు
వారిని ముందుగా హాస్పిటల్ కు పంపించి, అతడు తరువాత వచ్చే ట్రైన్ లో ఎక్కాలని అనుకున్నారు. కానీ ఆ కోరమాండల్ ఎక్స్ ప్రెస్ బాలేశ్వర్ నుంచి బయలుదేరిన కొంత సమయానికే ప్రమాదానికి గురైంది. ఈ విషయం తెలియడంతో గౌతమ్ దాస్ ఆందోళనకు గురయ్యాడు. వెంటనే ఘటన స్థలానికి వెళ్లి, తమ కుటుంబ సభ్యుల కోసం గాలించాడు. ఈ క్రమంలో తన భార్య, అత్త, బావమరిదిలో చనిపోయి కనిపించడంతో ఒక్కసారిగా కన్నీరుమున్నీరయ్యాడు. అక్కడే కుప్పకూలిపడిపోయాడు.
51 గంటల్లో ట్రాక్ పునరుద్దరణ.. రైళ్ల రాకపోకలు తిరిగి ప్రారంభం..
అక్కడి సిబ్బంది సాయంతో ముగ్గురు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నాడు. అనంతరం వారి మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించాడు. గౌతమ్ దాస్ కు, విష్ణుప్రియదాస్ ల వివాహ మొదటి వార్షికోత్సవం ఇటీవలే జరిగింది. ఇంతలోనే ఈ ప్రమాదం చోటు చేసుకోవడంతో ఆయన కన్నీరుమున్నీరుగా విలపించాడు.