పెరూలో ఘోర ప్రమాదం.. కొండపై నుంచి పడిపోయిన బస్సు.. 24 మంది మృతి..

పెరూలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఓ టూరిస్ట్ బస్సు కొండపై నుంచి కింద పడిపోయింది. దీంతో 24 మంది మరణించారు. ఈ ఘటన చోటు చేసుకున్న సమయంలో బస్సులో 60 మంది ప్రయాణికులు ఉన్నారు. 

A terrible accident in Peru.. Bus fell from the hill.. 24 people died..

ఉత్తర పెరూలో శనివారం తెల్లవారుజామున 60 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు కొండపై నుండి పడిపోయింది. ఈ ఘటనలో దాదాపు 24 మంది మరణించారు. ఈ విషయాన్ని స్థానిక పోలీసులు ధృవీకరించారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. కోరియాంకా టూర్స్ కంపెనీకి చెందిన బస్సు, లిమా నుండి బయలుదేరి, ఈక్వెడార్ సరిహద్దులోని టుంబేస్‌కు వెళ్తోంది. అది ఆర్గానోస్ పట్టణానికి సమీపంలో రోడ్డుపైకి చేరుకుంది.

ఫీల్డ్ పర్యటనలో సీఎం.. ఫిబ్రవరిలో తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కొత్త కార్యక్రమం

ఈ క్రమంలో డెవిల్స్ కర్వ్ అని పిలిచే ప్రదేశంలో అదుపుతప్పి కొండపై నుంచి పడిపోయింది. ఈ ఘటనలో 24 మంది అక్కడికక్కడే చనిపోయారు. మిగితా వారికి గాయాలు అయ్యాయి. బస్సు కొండపై నుంచి కిందపడిన సమయంలో పలువురు బస్సులోనే చిక్కుకున్నారు. మరి కొందరు కింద పడిపోయారు. 

క్షతగాత్రులను ఎల్ ఆల్టో, మాన్‌కోరాలోని ఆసుపత్రులకు తరలించారు. అయితే ఈ ప్రమాదానికి కారణం ఏంటనేది ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. ఈ బస్సు ప్రమాదం పెరూకు ఉత్తరాన ఉన్న ఎల్ ఆల్టో జిల్లాలో సంభవించిందని ‘సుత్రాన్’ పేర్కొంది. బస్సులో అత్యాధునిక భద్రతా తనిఖీ, ప్రమాద బీమా ఉన్నట్లు ప్రారంభ దర్యాప్తులో తేలిందని తెలిపింది. 

స్కూటీ యాక్సిడెంట్‌ బాధితులను రక్షించడానికి వెళ్లారు.. వారి పైకి ట్రక్కు దూసుకెళ్లింది.. ఐదుగురు దుర్మరణం

పెరూలో రోడ్డు ప్రమాదాలు సర్వ సాధారణం. చాలా మంది డ్రైవర్లు ప్రమాదకర రహదారులపై సరైన శిక్షణ లేకుండా వాహనాలను నడుపుతుంటారు. 2021 లో అండీస్ పర్వతాలలో ఓ బస్సు హైవే నుండి పడిపోవడంతో 29 మంది మరణించారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios