స్కూటీ యాక్సిడెంట్ బాధితులను రక్షించడానికి వెళ్లారు.. వారి పైకి ట్రక్కు దూసుకెళ్లింది.. ఐదుగురు దుర్మరణం
ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరిలో ఘోర ప్రమాదం జరిగింది. స్కూటీ, కారు యాక్సిడెంట్ అయిన ప్రాంతానికి వెళ్లి బాధితులను రెస్క్యూ చేస్తున్న వారిపైకి ఓ భారీ ట్రక్కు బ్యాలెన్స్ కోల్పోయి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఐదుగురు మరణించారు.
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. స్కూటీ, కారు యాక్సిడెంట్ జరగడంతో అక్కడే ఉన్న కొందరు పరుగున స్పాట్‌కు వెళ్లారు. బాధితులను కాపాడే ప్రయత్నంలో పడిపోయారు. ఒక వైపు వీరు రెస్క్యూ చేస్తుండగానే పది చక్రాల భారీ ట్రక్కు ఒకటి అటు వైపుగా వచ్చింది.బ్యాలెన్స్ కంట్రోల్ తప్పిన ఆ ట్రక్కు అక్కడ సహాయం చేస్తున్న వారిపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఐదుగురు మరణించారు. ఈ ఘటన యూపీలోని లఖింపూర్ ఖేరిలో చోటుచేసుకుంది.
లఖింపూర్ ఖేరిలోని గోలా బెహ్రెయిన్ హైవే పై ఓ స్కూటీ, ఒక కారు ఢీకొట్టుకున్నాయి. దీంతో అక్కడే ఉన్న కొందరు పాదాచారులు వెంటనే స్పాట్‌కు వెళ్లారు. ప్రమాదం గురించిన విషయాలను పరిశీలించారు. బాధితులను రక్షించే ప్రయత్నంలో మునిగిపోయారు. కానీ, అటు వైపుగా వచ్చిన ఓ భారీ ట్రక్కు సహాయ పనుల్లో మునిగిన వారిపైకి దూసుకెళ్లింది.
స్థానిక పోలీసుల స్పాట్‌కు వెళ్లారు. గాయపడిన వారిని చికిత్స కోసం సమీప హాస్పిటల్‌కు తరలించారు. బెహ్రెయిచ్ నుంచి వస్తున్న పది వీల్స్ ట్రక్కు బ్యాలెన్స్ తప్పిందని పోలీసులు ఆజ్ తక్ మీడియా సంస్థతో మాట్లాడుతూ తెలిపారు. అది అక్కడే సహాయక పనుల్లో మునిగి ఉన్న పాదాచారుల మీదికి దూసుకెళ్లింది. ఈ ఘటనలో కనీసం ఐదుగురు మరణించారు. చాలా మంది గాయాలపాలయ్యారు.
Also Read: తిరుపతి సమీపంలో రోడ్డు ప్రమాదం.. మహారాష్ట్రకు చెందిన నలుగురు భక్తులు మృతి
ఆ ట్రక్కు ఎలా బ్యాలెన్స్ కోల్పోయిందనే విషయాలను ఇంకా పరిశీలించాల్సి ఉన్నదని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్టు వివరించారు.
కాగా, ఈ దారుణ ఘటనపై యూపీ ప్రతిపక్ష నేత, సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేశ్ యాదవ్ స్పందించారు. బాధితుల కుటుంబాలకు పరిహారం అందించాలని ఆయన ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.