భారత్ చూపిస్తానని పిలిచి..ఢిల్లీలో స్విట్జర్లాండ్ మహిళ దారుణ హత్య..

స్విజ్జర్లాండ్ కు చెందిన ఓ యువతి దేశ రాజధాని ఢిల్లీలో దారుణ హత్యకు గురయ్యారు. కాళ్లు, చేతులు కట్టేసిన స్థితిలో ఆమె డెడ్ బాడీ లభ్యమైంది. ఈ ఘటనలో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. 

A Swiss woman was brutally murdered in Delhi by calling her to show India..ISR

భారత్ చూపిస్తానని పిలిచి దేశ రాజధాని ఢిల్లీలో ఓ స్విజ్జర్లాండ్ మహిళను యువకుడు దారుణంగా హత్య చేశాడు. రెండు, మూడు రోజుల కిందట ఈ హత్య జరగ్గా.. తాజాగా వెలుగులోకి వచ్చింది. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ‘ఎన్డీటీవీ’ కథనం, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 

ఢిల్లీకి చెందిన  గురుప్రీత్ సింగ్ అనే యువకుడు తరచూ స్విట్జర్లాండ్‌కు వెళ్లేవాడు. దీంతో ఆ దేశానికి చెందిన బెర్గర్ (30) అనే యువతి పరిచయం అయ్యింది. కొంత కాలం తరువాత వారి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. ఈ క్రమంలో పలుమార్లు ఆ దేశానికి గురుప్రీత్ సింగ్ వెళ్లి వస్తుండేవాడు. 

మానవ అంతరిక్ష యాత్రకు ఒక్క అడుగు దగ్గరకు తీసుకెళ్లింది - గగన్ యాన్ సక్సెస్ పై ప్రధాని మోడీ ప్రశంసలు

అయితే కొన్ని రోజుల తరువాత బర్గర్ కు మరో వ్యక్తితో సంబంధం ఉందని గురుప్రీత్ సింగ్ అనుమానించాడు. దీంతో ఆమెను అంతమొందించాలని పథకం వేశాడు. అందులో భాగంగానే ఆమెను భారత్ కు ఆహ్వానించాడు. ఇక్కడికి వస్తే దేశం మొత్తం చూపిస్తానని ఆమెకు చెప్పాడు. దీనిని నమ్మి బెర్గర్ అక్టోబర్ 11న భారత్ కు వచ్చింది. ఐదు రోజుల తర్వాత యవకుడు ఆమెను ఓ గదిలోకి తీసుకెళ్లాడు. అనంతరం ఏవో మాయమాటలు చెప్పి బెర్గర్ కాళ్లు, చేతులు కట్టేసి దారుణంగా హతమార్చాడు. 

కాలేజీ ఫెస్ట్ లో ‘జై శ్రీరామ్’ నినాదాలు.. వేదిక నుంచి దిగిపోవాలని ప్రొఫెసర్ హుకుం.. వీడియో వైరల్

అంతకు ముందే వేరే మహిళ ఐడీతో ఓ సెకెండ్ హ్యాండ్ కారును కొనుగోలు చేశాడు. ఆ కారులో బెర్గర్ డెడ్ బాడీని ఉంచాడు. ఆ కారును ఓ చోట పార్క్ చేశాడు. కొన్ని రోజుల తర్వాత మృతదేహం కుళ్లిపోవడం ప్రారంభించడంతో, కారు నుంచి దుర్వాసన రావడం మొదలైంది. దీంతో అతడు ఆ డెడ్ బాడీని ఢిల్లీలోని తిలక్ నగర్ ప్రాంతంలో పారేసి వెళ్లిపోయాడు. దానిని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు.

నా పెళ్లాం నుంచి కాపాడండి మహాప్రభో.. తలకు కట్టుతో, శోకాలు పెడుతూ పోలీసులను ఆశ్రయించిన యువకుడు..

సీసీటీవీ ఫుటేజీ సాయంతో కారు రిజిస్ట్రేషన్ నంబర్ ఆధారంగా పోలీసులు నిందితుడిని గుర్తించారు. అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. తాజాగా గురుప్రీత్ సింగ్ ను అరెస్టు చేశారు. అతడి ఇంటి నుంచి రూ.2.25 కోట్లను ఢిల్లీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుడిని విచారిస్తున్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios