Asianet News TeluguAsianet News Telugu

వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ఢీకొని మహిళ మృతి.. గుజరాత్‌లోని ఆనంద్‌లో ఘటన

వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు ఢీకొని ఓ మహిళ చనిపోయింది. గుజరాత్ లోని ఆనంద్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఆ రైలు గాంధీనగర్ నుంచి ముంబై వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

Vande Bharat Express train collided with woman and died.. Incident in Anand, Gujarat
Author
First Published Nov 8, 2022, 11:14 PM IST

దేశంలోనే అత్యంత హైటెక్ స్పీడ్ రైలు అయిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్ తరచూ ప్రమాదాలకు గురవుతోంది. మొదటగా గుజరాత్‌లో పశువులు ఢీకొనడంతో ఈ రైలు ఇంజన్ ముందు భాగం బాగా దెబ్బతింది.. సోమవారం సాయత్రం ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ గుజరాత్‌కు వెళుతుండగా రైలుపై రాళ్ల దాడి జరిగినట్లు వార్తలు వచ్చాయి. అయితే రైలు వేగం కారణంగానే రాళ్లు ఎగిరి అలా జరిగిందని రైల్వే శాఖ రాళ్ల దాడి అంశాన్ని తిరస్కరించింది. కాగా తాజాగా ఈ రైలుకు సంబంధించి మరో ప్రమాద వార్త తెరపైకి వచ్చింది.

13 ఏళ్ల బాలికపై అత్యాచారం,హత్య.. ఆత్మహత్యగా చిత్రీకరణ.. సీఐడీ ఎంట్రీతో అసలు విషయం వెలుగులోకి ..

ముంబై వెళ్తున్న వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ఢీకొని గుజరాత్‌లోని ఆనంద్‌ సమీపంలో  ఓ మహిళ మృతి చెందింది. మంగళవారం సాయంత్రం 4.37 గంటలకు ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో చనిపోయిన మహిళను అహ్మదాబాద్ చెందిన 54 ఏళ్ల బీట్రైస్ ఆర్కిబాల్డ్ పీటర్‌గా గుర్తించారు. 

ఈ రైలు గాంధీనగర్ క్యాపిటల్ స్టేషన్ నుంచి సెంట్రల్ ముంబైకి వెళ్తుంది. అయితే సాయంత్రం 4:37 గంటలకు ఆ మహిళ  రైల్వే ట్రాక్ దాటుతుండగా ఒక్క సారిగా పట్టాలపై నుంచి వేగంగా పరుగులు తీస్తున్న రైలు ఆమెను ఢీకొట్టింది. ఆ రైలు ఆనంద్ స్టేషన్ లో ఆగదని, కానీ ఆ మహిళ రైలు రాకముందే రైల్వే ట్రాక్‌ను దాటడం ప్రారంభించిందని, కానీ కొన్ని క్షణాల్లోనే ప్రమాదానికి గురైందని రైల్వే పోలీసులు తెలిపారు. కాగా ఆ మహిళ ఆనంద్‌లోని తన బంధువుల వద్దకు వెళ్తోంది. ఆమె మృతితో కుటుంబంలో విషాదఛాయలు అలముకున్నాయి.

రిజ‌ర్వేష‌న్ల‌పై 50 శాతం ప‌రిమితి తొలగించండి: బీహార్ సీఎం డిమాండ్

గాంధీనగర్ నుంచి ముంబైకి ప్రయాణించే ఈ హైటెక్ రైలును ప్రధాని నరేంద్ర మోడీ సెప్టెంబర్ 30వ తేదీన ప్రారంభించిన సంగతి తెలిసిందే. దాదాపు ఈ నెల రోజుల వ్యవధిలో నాలుగు ప్రమాదాలు జరిగాయి. అక్టోబర్ 29న ముంబై-గాంధీనగర్ ప్రయాణిస్తున్న వందే భారత్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ గుజరాత్‌లోని అతుల్ స్టేషన్ సమీపంలో పశువులపైకి దూసుకెళ్లింది. అక్టోబరు 6, 7 తేదీల్లో కొన్ని పశువులపై రైలు దూసుకెళ్లింది.

ఈ మూడు వరుస ప్రమాద ఘటనలు గుజరాత్‌లో రైల్వే అధికారులను సమస్యాత్మకంగా మార్చాయి. దీనిని నివారించడానికి రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ప్రయత్నాలు మొదలు పెట్టింది. మహారాష్ట్రలోని పాల్ఘర్‌లోని మార్గంలో ఉన్న గ్రామాల పెద్దలకు నోటీసులు అందజేసింది. జంతువులను ట్రాక్‌ల దగ్గర రానివ్వకుండా జాగ్రత్త పడాలని హెచ్చరించింది.

అంతరిక్ష రంగంలో నూతన శకానికి నాంది.. ప్రయోగించడానికి సిద్దంగా ఉన్న స్వదేశీ తొలి ప్రైవేట్ రాకెట్..

‘‘పశువులను ఢీకొట్టే ఇలాంటి ఘటనలు రైలు కార్యకలాపాలను ప్రతికూలంగా ప్రభావితం చేశాయి. వీటి వల్ల రైలు ప్రమాదాలు కూడా జరిగే అవకాశం అధికంగా ఉంటుంది. పలు సమయాల్లో రైలు పట్టాలు కూడా తప్పే అవకాశం ఉంటుంది. వీటి వల్ల రైలుట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతుంది. వీటి వల్ల రైల్వే ఆస్తులకు నష్టం ఏర్పటమే కాకుండా, ప్రయాణికుల ప్రాణాలకు కూడా ప్రమాదం ఏర్పడుతుంది’’ అని పశ్చిమ రైల్వే ముఖ్య ప్రతినిధి సుమిత్ ఠాకూర్ వార్తా సంస్థ ‘పీటీఐ’తో తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios