సైబర్ నేరగాళ్లు కొత్త పంథాను ఎంచుకుంటున్నారు. గతంలో కాల్స్ చేసి మీ డెబిట్ కార్డు బ్లాక్ అయ్యిందని, తాము ఓటీపీ పంపిస్తామని అది చెబితే ఎప్పటిలాగే పని చేస్తుందని చెప్పేవారు. అయితే ఇప్పుడు మన ప్రమేయం లేకుండానే బ్యాంక్ నుంచి డబ్బులను కొల్లగొడుతున్నారు. 

సైబర్ నేరగాళ్లు ఫేక్ కాల్స్ చేసి ఓటీపీ అడుగుతూ బ్యాంకు ఖాతాల నుంచి డబ్బులు దోచుకుంటూ ఉండటం అందరికీ తెలిసిందే. అయితే ఇలాంటి నేరాలపై ప్రజలకు కొంత మేర అవగాహన రావడంతో చాలా మంది ఓటీపీలు చెప్పడం మానేశారు. దీంతో సైబర్ నేరగాళ్లు కొత్త తరహా నేరాలకు పాల్పడుతున్నారు.

యువతిని కిడ్నాప్ చేసి, వేరే రాష్ట్రానికి తీసుకెళ్లి.. రెండు వారాలపాటు అత్యాచారం..

ఓటీపీ అడగకుండానే సెక్యూరిటీ ఏజెన్సీ సంస్థ డైరెక్టర్ ఖాతా నుంచి సైబర్ దుండగులు లక్షల రూపాయలను దోచుకున్నారు. ఇలాంటి ఘటన ఒకటి ఢిల్లీలో వెలుగులోకి వచ్చింది. సైబర్ నేరగాళ్లు పలుమార్లు మిస్డ్ కాల్స్, బ్లాంక్ ఎస్‌ఎంఎస్‌లు ఇచ్చి ఓటీపీని దారి మళ్లించి సుమారు రూ.50 లక్షలు స్వాహా చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి.

ఈ నెల 14న మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేయ‌నున్న ఉద‌య‌నిధి స్టాలిన్

ఢిల్లీలోని ఓ సెక్యూరిటీ సర్వీసెస్ సంస్థ డైరెక్టర్ కు అక్టోబర్ 10వ తేదీన రాత్రి 7 గంటల నుంచి 8:44 నిమిషాల మధ్య వరుసగా కొన్ని మెసేజ్ లు వచ్చాయి. అలాగే కొన్ని కాల్స్ కూడా వచ్చాయి. అయితే అందులో కొన్నింటికి ఆయన సమాధానం ఇచ్చారు. అవతలి వైపు నుంచి ఎవరూ మాట్లాడలేదు. దీంతో మరికొన్ని కాల్స్ వచ్చినా వాటిని పట్టించుకోలేదు. కొంత సమయం తరువాత ఫోన్ వైపు చూశాడు. బ్యాంకు నుంచి వరుసగా మెసేజ్ లు వచ్చాయి. వాటిని ఓపెన్ చేస్తే తన బ్యాంక్ అకౌంట్ నుంచి రూ.50 లక్షలు ఆర్టీజీఎస్ (ఇన్‌స్టంట్ ఫండ్ ట్రాన్స్‌ఫర్) లావాదేవీలు జరిగాయని అర్థమై ఒక్క సారిగా షాక్ కు గురయ్యాడు.

భారత్-చైనా సైనికుల ఘర్షణ: మోడీ బ‌ల‌హీన రాజ‌కీయ నాయ‌క‌త్వ‌మే.. పార్లమెంటులో వాయిదా తీర్మానం పెడుతాం: ఒవైసీ

వెంటనే ఆయన బ్యాంకును సంప్రదించాడు. కంపెనీ కరెంట్ ఖాతా నుంచి రూ.50 లక్షల కంటే ఎక్కువ మోసపూరిత లావాదేవీలు జరిగాయని అధికారులు తెలిపారు. అయితే ఇందులోని రూ.12 లక్షలు భాస్కర్ మండలానికి చెందిన ఓ వ్యక్తి ఖాతాకు, అవిజిత్ గిరి అనే వ్యక్తి ఖాతాకు రూ.4.6 లక్షలు చేరినట్లు విచారణలో తేలింది. ఇది కాకుండా మరో రెండు ఖాతాలకు సుమారు రూ. 10 లక్షల రూపాయలు చేరాయి.