వావ్.. నదిలో జాలర్లకు దొరికిన అరుదైన భారీ స్పటిక శివలింగం.. ఎంత విశిష్టమైనదో తెలుసా ?
గుజరాత్ (Gujarat) లోని భరూచ్ (Bharuch) జిల్లాలో ఓ ఆశ్చర్యకరమైన విషయం వెలుగులోకి వచ్చింది. చేపలు పట్టేందుకు వెళ్లిన మత్స్యకారులకు వలలో అరుదైన స్పటిక శివలింగం (Crystal Shivling) చిక్చింది. ఇలాంటి శివలింగం చాలా అరుదుగా ఉంటుంది. ఆ లింగం 100 కిలోల బరువు, ఎనిమిది అడుగుల ఎత్తు ఉంది.
గుజరాత్ భరూచ్ జిల్లాలోని జంబూసర్ తాలూకాలోని కవి గ్రామంలో ఓ ఆశ్చర్యకరమైన ఘటన జరిగింది. ఇది స్థానికులను, మత్స్యకారులను విస్మయానికి గురిచేసింది. చేపలు పట్టేందుకు వెళ్లిన కవి మత్సకారులకు వలలో భారీ స్పటిక శివలింగం చిక్కింది. దీని బరువు సుమారు 100 కిలోలు ఉంటుంది. ఎనిమిది అడుగుల ఎత్తులో ఉన్న ఈ లింగాన్ని ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ మత్సకారులు జాగ్రత్తగా పడవలోకి ఎక్కించుకుని ఒడ్డుకు చేర్చారు. ఈ అరుదైన స్పటిక శివలింగాన్ని చూసేందుకు గ్రామస్తులు, చుట్టుపక్కల ఊర్ల ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చారు.
సీఎం జగన్ మహా నటుడు.. ఆస్కార్ అవార్డు ఇచ్చినా తక్కువే - నాగబాబు
జంబూసర్ తాలూకాలోని కవి గ్రామంలో అధిక శాతం చేపలు పడుతూ జీవనం సాగిస్తారు. అయితే ఎప్పటిలాగే మూడు రోజుల కిందట ఆ గ్రామానికి చెందిన కాళీ దాస్ వాఘేలా, మంగళ్ కాళీ దాస్ ఫకీరాతో పాటు 12 మంది మత్స్యకారులు నదీ తీరానికి సమీపంలో ఉన్న ధన్కా తీర్థ్ సమీపంలో సాధారణ చేపల వేటను ప్రారంభించారు. చేపలను పట్టుకునే క్రమంలో వారి వలల్లో చేపలే కాకుండా శివలింగం కూడా చిక్కింది. దీంతో వారు అయోమయానికి గురయ్యారు. తరువాత తీరుకోని ఆ భారీ లింగాన్ని పడవలో వేసేందుకు ప్రయత్నించారు.
కానీ 100 కిలోల కంటే అధికంగా బరువు ఉండటం వల్ల పడవలో వేయడం సాధ్యం కాలేదు. సమీపంలో ఉన్న ఇతర మత్సకారులకు సమాచారం అందించి, వారి సాయంతో పడవలో ఎక్కించారు. ఆ లింగాన్ని ఒడ్డుకు చేర్చడం కూడా వారికి సవాళుగా మారింది. ఎన్నో కష్టాలను అధిగమించి చివరికి ఆ అరుదైన శివలింగాన్ని కవి గ్రామ తీరానికి విజయవంతంగా తరలించారు.
పాకిస్థాన్ లో రోడ్డెక్కిన పీటీఐ మద్దతుదారులు.. దేశ వ్యాప్తంగా నిరసనలు.. అసలేమైందంటే ?
మత్స్యకారులు ఆ లింగాన్ని ఒడ్డుకు చేర్చిన తరువాత పూర్తిగా శుభ్ర పరిచారు. దీనిపై వెండి సర్ప రూపం కూడా ఉందని కూడా గుర్తించారు. ఈ విషయం స్థానిక ప్రజలకు తెలియడంతో పెద్ద ఎత్తున అక్కడికి తరలివచ్చారు. దీనిపై వెండి సర్ప రూపం కూడా ఉండటం గమనార్హం. ఈ విషయాన్ని మత్స్యకారులు ఆహిర్ పోలీసులకు సమాచారం అందించారు. కాగా.. ఈ శివలింగాన్ని స్థానికంగా ఉన్న కమలేశ్వర్ మహాదేవ్ ఆలయం లేదా సమీపంలో ఉన్న మరో శివాలయంలో ప్రతిష్టించాలని గ్రామస్తులు భావిస్తున్నారు.