తన గుర్తింపును దాచి పెట్టి మహిళలతో లైంగిక సంబంధాలు పెట్టుకునే వారికి కఠిన శిక్షలు విధిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. ఇండియన్ పీనల్ కోడ్, కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో కేంద్రం కొత్త బిల్లులు తీసుకొచ్చింది. 

దేశంలో క్రిమినల్ జస్టిస్ వ్యవస్థను సమూలంగా మార్చాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. దీనికి సంబంధించిన మూడు బిల్లులను కేంద్ర హోం మంత్రి అమిత్ షా శుక్రవారం లోక్ సభలో ప్రవేశపెట్టారు. ఇండియన్ పీనల్ కోడ్, కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో ఈ బిల్లులను తీసుకొచ్చారు. ఇవి శిక్షించడానికి కావని, న్యాయం చేయడమే వాటి ఉద్దేశమని లోక్ సభలో ఈ బిల్లులు ప్రవేశపెట్టిన సందర్భంగా అమిత్ షా అన్నారు. తన గుర్తింపును దాచి పెట్టి మహిళలతో లైంగిక సంబంధాలు పెట్టుకునే వారికి కఠిన శిక్షలు విధిస్తామని హోంమంత్రి తెలిపారు. 

Scroll to load tweet…

అంతేకాదు మైనర్‌పై అత్యాచారానికి పాల్పడితే మరణశిక్ష, గ్యాంగ్‌‌రేప్‌కు 20 ఏళ్లు జైలు శిక్ష విధించేలా చట్టంలో కీలక మార్పులు తీసుకొచ్చింది మోడీ ప్రభుత్వం. మహిళలు , పిల్లలపై నేరాలకు సంబంధించిన శిక్షల్లో కొన్ని మార్పులను ప్రతిపాదిస్తూ భారతీయ క్రిమినల్ చట్టాలను సవరించడానికి మూడు కొత్త బిల్లులను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ బిల్లులను సమీక్ష కోసం స్టాండింగ్ కమిటీకి పంపుతారు. ప్రతిపాదిత చట్టాల ప్రకారం.. సామూహిక అత్యాచారానికి పాల్పడిన వ్యక్తికి కనీసం 20 సంవత్సరాల జైలు శిక్ష, గరిష్టంగా జీవిత ఖైదు విధించబడుతుంది.

కఠిన కారాగార శిక్ష 20 సంవత్సరాల కంటే తక్కువ ఉండదని, అయితే జీవిత ఖైదు వరకు పొడిగించవచ్చని బిల్లు పేర్కొంది. అంటే ఆ వ్యక్తికి జీవితాంతం జైలు శిక్ష, జరిమానా అని బిల్లులో పేర్కొన్నారు. ఎవరైనా మోసపూరిత మార్గాల ద్వారా లేదా వివాహ వాగ్దానాన్ని నెరవేర్చాలనే ఉద్దేశ్యం లేకుండా స్త్రీతో లైంగిక సంబంధాలు కలిగి ఉంటే, అలాంటి లైంగిక సంపర్కం అత్యాచార నేరంగా పరిగణించబడదు. కానీ శిక్ష విధించబడుతుంది. ప్రతిపాదిత BNSలో 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష , జరిమానా కూడా చేర్చబడింది. మైనర్‌పై అత్యాచారం చేస్తే మరణశిక్ష విధించాలని ప్రభుత్వం ప్రతిపాదించిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్లమెంట్‌లో బిల్లును ప్రవేశపెడుతూ చెప్పారు.

పద్దెనిమిది సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న స్త్రీకి వ్యతిరేకంగా ఒకరు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు ఒక సమూహాన్ని ఏర్పాటు చేస్తే లేదా ఉమ్మడి ఉద్దేశ్యంతో ప్రవర్తిస్తే, వారిలో ప్రతి ఒక్కరూ అత్యాచారానికి పాల్పడినట్లుగా పరిగణించబడుతుందని చట్టం చెబుతోంది. ఇందుకు గాను 20 ఏళ్లకు పైగా జైలు శిక్ష విధిస్తారు. జీవితాంతం జైలు శిక్ష, జరిమానా లేదా మరణశిక్ష విధించబడుతుందని బిల్లు పేర్కొంది.