Asianet News TeluguAsianet News Telugu

వాహనదారులకు భారీ ఊరట.. 2017-2021 మధ్య ఉన్న ట్రాఫిక్ చలాన్లు రద్దు

ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అక్కడి వాహనదారులకు శుభవార్త చెప్పింది. 2017 నుంచి 2021 డిసెంబర్ మధ్య వరకు ఉన్న ట్రాఫిక్ చలాన్లను రద్దు చేసింది. దీంతో కోట్లాది మంది వాహనదారులకు ఊరట లభించింది. 

A huge relief for motorists.. Traffic challans between 2017-2021 have been cancelled..ISR
Author
First Published Jun 10, 2023, 9:04 AM IST

2017 నుంచి 2021 వరకు ప్రైవేట్, వాణిజ్య వాహనాల యజమానులకు పెండింగ్ లో ఉన్న ట్రాఫిక్ చలాన్లను రద్దు చేయాలని ఉత్తరప్రదేశ్ లోని యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ప్రభుత్వం నిర్ణయించింది. వాహన రకంతో సంబంధం లేకుండా జనవరి 1, 2017 నుంచి డిసెంబర్ 31, 2021 మధ్య జారీ చేసిన అన్ని చలాన్లకు రద్దు వర్తిస్తుంది. ఇందులో ప్రస్తుతం వివిధ కోర్టుల్లో పెండింగ్లో ఉన్న కేసులు కూడా ఉన్నాయి.

దారుణం.. వితంతువుపై దొంగ అత్యాచారం.. అనంతరం నగలు ఎత్తుకెళ్లిన దుండగుడు

2023 జూన్ నాటి ఉత్తరప్రదేశ్ ఆర్డినెన్స్ నెం.2కు అనుగుణంగా ఈ ఉత్తర్వులు జారీ చేసినట్లు రవాణా శాఖ కమిషనర్ చంద్ర భూషణ్ సింగ్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా కోట్లాది చలాన్ల మాఫీకి మార్గం సుగమం చేసిన యూపీ ప్రభుత్వ నిర్ణయంతో కోట్లాది మందికి లబ్ధి చేకూరనుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ కు బెదిరింపులు.. హోం మినిస్టర్ జోక్యం చేసుకోవాలి - సుప్రియా సూలే

కాగా.. ప్రభుత్వం పేర్కొన్న వ్యవధి తరువాత ఉన్న చలాన్ లను చెల్లించేందుకు వాహన డ్రైవర్లు భయపడాల్సిన అవసరం లేదని ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ‘‘పాత పెండింగ్‌లో ఉన్న చలాన్‌లను రద్దు చేసినందున, ఈ వ్యవధి తర్వాత డ్రైవర్లు భయపడాల్సిన అవసరం లేదు. వారు ఇంట్లో కూర్చొని ఆన్‌లైన్ ట్రాఫిక్ చలాన్‌లను చెల్లించవచ్చు. యూపీ ట్రాఫిక్ పోలీసుల అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి వారంతా వివరణాత్మక సమాచారాన్ని పొందవచ్చు. దీని కోసం వాహనం నంబర్ మాత్రమే అవసరం’’ అని రవాణా కమిషనర్ పేర్కొంది.

తప్పుడు చలాన్ జారీ చేసినట్లు వాహన యజమాని భావిస్తే ఫిర్యాదు చేయవచ్చని రవాణా కమిషనర్ చంద్ర భూషణ్ సింగ్ తెలిపారు. వాహనం చలానా మినహాయించినప్పుడు మొబైల్ నోటిఫికేషన్ కూడా వస్తుందని చెప్పారు. దీని కమ్యూనికేషన్ సులభం అవుతుందని పేర్కొన్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios