కొన్ని దేశాలు ఉగ్రవాదులకు సురక్షిత స్థావరాలుగా మారాయని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. లాంటి దేశాలను విమర్శించడానికి ఎస్ సీవో వెనుకాడకూడదని సూచించారు. మంగళవారం నిర్వహించిన షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్ సీఓ) వర్చువల్ సమ్మిట్ లో ప్రధాని పాల్గొని మాట్లాడారు. 

షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్ సీఓ) వర్చువల్ సమ్మిట్ లో ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం ప్రసంగిస్తూ.. ఉగ్రవాదం విషయంలో పరోక్షంగా పాకిస్థాన్ పై విరుచుకుపడ్డారు. సీమాంతర ఉగ్రవాదాన్ని కొన్ని దేశాలు తమ విధాన సాధనంగా వాడుకుంటున్నాయని అన్నారు. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కూడా పాల్గొన్న వర్చువల్ ఎస్ సీవో సదస్సులో ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు.

సెంథిల్ బాలాజీ అరెస్టుకు వ్యతిరేకంగా హెబియస్ కార్పస్ పిటిషన్.. భిన్నమైన తీర్పు ఇచ్చిన మద్రాస్ హైకోర్టు

ఉగ్రవాదం ప్రాంతీయ, ప్రపంచ శాంతికి ముప్పుగా పరిణమించిందన్నారు. ‘‘ఉగ్రవాదంపై పోరాడాలి... కొన్ని దేశాలు సీమాంతర ఉగ్రవాదాన్ని తమ విధానాలకు సాధనంగా వాడుకుని ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తున్నాయి. అలాంటి దేశాలను విమర్శించడానికి ఎస్ సీవో వెనుకాడకూడదు. దీన్ని షాంఘై సహకార సంస్థ (ఎస్ సీవో) దేశాలు ఖండించాలి. ఉగ్రవాదంపై ద్వంద్వ ప్రమాణాలు ఉండకూడదు’’ అని ప్రధాని మోడీ ఏ దేశం పేరును ప్రస్తావించకుండా వ్యాఖ్యానించారు.

Scroll to load tweet…

ఉగ్రవాదం ప్రాంతీయ, ప్రపంచ శాంతికి ముప్పుగా పరిణమించిందని, దీన్ని ఎదుర్కోవడానికి నిర్ణయాత్మక చర్యలు అవసరమని ప్రధాని మోడీ నొక్కి చెప్పారు. టెర్రర్ ఫైనాన్సింగ్ ను ఎదుర్కోవడానికి పరస్పర సహకారాన్ని విస్తరించాలని పిలుపునిచ్చిన ప్రధాని మోడీ, ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్న కలిసి పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. ఈ వర్చువల్ సదస్సులో చైనా అధ్యక్షుడు జిన్ పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, షరీఫ్, షాంఘై సహకార సంస్థ (ఎస్ సీవో) దేశాల నేతలు పాల్గొన్నారు.

భర్త హోటల్‌ కు వాటర్ సప్లయ్ చేసే వ్యక్తితో భార్య అక్రమ సంబంధం.. అడ్డుగా ఉంటున్నాడని ప్రియుడితో కలిసి..

తాము ఎస్ సీఓను విస్తరించిన పొరుగుదేశంగా చూడడం లేదని, విస్తరించిన కుటుంబంగా చూస్తున్నామని చెప్పారు. ‘‘భద్రత, ఆర్థికాభివృద్ధి, కనెక్టివిటీ, ఐక్యత, సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రతను గౌరవించడం, పర్యావరణ పరిరక్షణ వంటివి షాంఘై సహకార సంస్థ (ఎస్ సీవో) దార్శనికతకు మూలస్తంభాలు’’ అని మోడీ పేర్కొన్నారు. షాంఘై సహకార సంస్థ చైర్మన్ గా మన బహుముఖ సహకారాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లేందుకు భారత్ నిరంతర కృషి చేస్తోందని ప్రధాన మంత్రి తెలిపారు.