మధ్యప్రదేశ్ లో దారుణం వెలుగులోకి వచ్చింది. ఓ గిరిజనుడిపై ఓ వ్యక్తి మూత్ర విసర్జన చేశాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. దీంతో అతడిని పోలీసులు అరెస్టు చేశారు. అయితే నిందితుడు ఏ పార్టీవాడైనా వదిలిపెట్టేది లేదని సీఎం స్పష్టం చేశారు.
మధ్యప్రదేశ్ లోని సిద్ధి జిల్లాలో ఘోరం జరిగింది. గిరిజన కూలీపై ఓ వ్యక్తి మూత్ర విసర్జన చేస్తున్న వీడియో వెలుగులోకి రావడంతో అది వైరల్ గా మారింది. అయితే అతడు బీజేపీ ఎమ్మెల్యే సహచరుడు అని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ వీడియోలో వైరల్ అయిన కొన్ని గంటల్లోనే నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. అతడు ఏ పార్టీ వాడైనా, ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టేది లేదని సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ స్పష్టం చేశారు.
పెళ్లయిన తరువాత భార్య ఖాళీగా కూర్చోకూడదు -కర్ణాటక హైకోర్టు
సిద్ధి జిల్లాలో ఈ ఘటన జరిగిన ఆరో రోజలు తరువాత ఆ వీడియోను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అంతకు కొన్ని గంటల ముందే అతడిపై చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేయడంతో అది వైరల్ గా మారింది. గిరిజన కూలీపై మూత్ర విసర్జన చేస్తూ కెమెరాకు చిక్కిన వ్యక్తిని ప్రవేశ్ శుక్లాగా పోలీసులు గుర్తించారు. అతడిని మంగళ, బుధవారాల్లో అర్ధరాత్రి అరెస్టు చేశారు. శుక్లాను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సీనియర్ పోలీసు అధికారి ఒకరు ‘ఏఎన్ఐ’ వార్తా సంస్థకు తెలిపారు. శుక్లాపై ఐపీసీ సెక్షన్ 294 (అశ్లీల చర్యలు), 504 (శాంతికి విఘాతం కలిగించేలా ఉద్దేశపూర్వకంగా అవమానించడం), ఎస్సీ, ఎస్టీ చట్టం కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
కాగా.. వైరల్ వీడియోపై మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ స్పందించారు. నిందితుడిపై జాతీయ భద్రతా చట్టం కింద అభియోగాలు నమోదు చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. నిందితుడిని ప్రభుత్వం కఠినంగా శిక్షిస్తుందని అన్నారు. అతడిని (దోషిని) ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు.
కొన్ని వర్గాల నుంచి నిందితుడు బీజేపీకి చెందిన వాడని ఆరోపణలు వస్తున్నాయని మీడియా అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ.. ‘నేరస్తులకు కులం, మతం, పార్టీ అంటూ ఏమీ ఉండవు. క్రిమినల్ అంటే కేవలం క్రిమినల్ మాత్రమే. అతడిని వదిలిపెట్టేది లేదు’ అని పేర్కొన్నారు. ఆయన ఏ పార్టీ వారైనా తప్పు చేశాడని, కావున శిక్ష తప్పదని మధ్యప్రదేశ్ హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా అన్నారు.
ఇదిలా ఉండగా.. ఈ వీడియో బయటకు వచ్చిన తర్వాత నిందితుడు ప్రవేశ్ శుక్లా బీజేపీ ఎమ్మెల్యే కేదార్ శుక్లా ప్రతినిధి ప్రతిపక్షాలు ఆరోపించాయి. వీరిద్దరూ కలిసి ఉన్న ఫొటోను శుక్లా గతంలో ఫేస్ బుక్ లో షేర్ చేశారు. అయితే నిందితుడితో తమకు ఎలాంటి సంబంధం లేదని బీజేపీ స్పష్టం చేసింది.
కాగా.. శుక్లా తన ప్రతినిధి కాదని, నిందితుడు తనకు తెలుసునని మాత్రమే కేదార్ శుక్లా అంగీకరించారు. అయితే తన కుమారుడు కేదార్ శుక్లా ప్రతినిధి అని ప్రవేశ్ శుక్లా తండ్రి రమాకాంత్ శుక్లా చెప్పారు. తన కుమారుడు బీజేపీ ఎమ్మెల్యే ప్రతినిధి అని, అందుకే ఆయనను ప్రతిపక్షాలు టార్గెట్ చేస్తున్నాయన్నారు. ఈ కేసులో సమగ్ర విచారణ జరిపి న్యాయం చేస్తారని ఆశిస్తున్నాని రమాకాంత్ శుక్లా పేర్కొన్నారు.
