మద్యం తాగితే మానసిక విచక్షణ కోల్పోతారని చెప్పడానికి ఇదో ఉదాహరణ. ఫుల్లుగా తాగిన ఓ యువకుడు అడవి నుంచి ఓ పామును తీసుకొచ్చి దానితో ఆడుకున్నాడు. గ్రామస్తులు ఎంత చెప్పినా పామును వదిలిపెట్టాడు. చిత్రహింసలు తట్టుకోలేక పాము అతడిని కాటేసింది. 

ఓ తాగుబాతు పాముతోనే ఆట‌లాడాడు. దానిని చేతిలో ప‌ట్టుకొని చిత్రహింస‌లు పెట్టాడు. అది పారిపోతుంటే మ‌ళ్లీ దానిని తీసుకొని ఒళ్లో పెట్టుకున్నాడు. మ‌ద్యం మ‌త్తులో దానిని ముద్దాడాడు. ఈ చిత్ర‌హింస‌లు భ‌రించ‌లేక ఆ నాగుపాము పలు మార్లు అత‌డిని కాటేసింది. దీంతో చివ‌రికి అత‌డు హాస్పిట‌ల్ లో చేరాల్సి వ‌చ్చింది. ఈ ఘ‌ట‌న ఒడిశా రాష్ట్రంలో జ‌రిగింది. 

స్పైస్‌ జెట్ విమానంలో పొగలు.. టెకాఫ్ అయిన కొద్దిసేపటికే..

డాబుగావ్ పోలీసు పరిధిలోని పత్రి గ్రామానికి చెందిన మాధబ్ గౌడ అనే యువకుడు సమీపంలోని జాంబగూడ గ్రామం అడవిలో తిరుగుతున్నాడు. ఈ స‌మ‌యంలో అక్క‌డ అత‌డికి నాగుపాము క‌నిపించింది. తాగిన మ‌త్తులో ఉండ‌టం వ‌ల్ల అత‌డు దానినితో ఆడుకోవాల‌ని అన‌కున్నాడు. దానిని దొర‌క‌బ‌ట్టుకొని త‌న స్వ‌గ్రామానికి తీసుకొచ్చాడు. 

Assam floods : వ‌ర‌ద‌ల‌తో అస్సాం అత‌లాకుత‌లం.. 24 గంటల్లో మ‌రో 14 మంది మృతి..

గ్రామంలో రోడ్డుపై దానిని ఉంచి ఆడుకోవ‌డం ప్రారంభించాడు. దీంతో గ్రామ‌స్తులు అంద‌రూ అక్క‌డికి చేరుకున్నారు. జ‌నం అంతా అక్క‌డికి రావ‌డంతో ఆ పాముతో డ్యాన్స్ చేయ‌డం మొద‌లు పెట్టాడు. అత‌డి వాల‌కం చూసిన గ్రామ‌స్తులు దానిని విడిచిపెట్టాల‌ని ఎంతో మొత్తుకున్నారు. అది విష‌పూరిత‌మైందని, కాటేస్తే చ‌నిపోతావ‌ని చెప్పినా మాధ‌బ్ గౌడ వినిపించుకోలేదు. మ‌త్తులో దానితో ఆడుకుంటూనే ఉన్నాడు. ఈ స‌మ‌యంలో నాగుపాము తలను పట్టుకుని ముద్దాడాడు. దీంతో పాము అతని పెదవులపై కాటు వేసింది. పెదవుల నుండి రక్తం కారడం మొద‌లైన‌ప్ప‌టికీ పామును విడిచిపెట్టలేదు. 

AAP Tiranga Shakha: యూపీలో 1000 చోట్ల.. ఆర్‌ఎస్‌ఎస్ కు పోటీగా "ఆప్ తిరంగ శాఖ" ప్రారంభం

పామును విడిచిపెడితే డ‌బ్బులు ఇస్తామ‌ని గ్రామ‌స్తులు మాధ‌బ్ కు చెప్పారు. దీంతో డ‌బ్బు ఆశ‌తో దానిని వ‌దిలేయ‌డానికి అడ‌వికి వెళ్లాడు. అయితే ఇంకా ఆగ‌కుండా పాముతో మ‌ళ్లీ ఆడుకోవ‌డం ప్రారంభించాడు. దీంతో మ‌ళ్లీ పాము అత‌డినికి పాదాలపై కాటేసింది. చివ‌రికి అది పారిపోయింది. మాధ‌బ్ అపస్మారక స్థితిలో చేర‌కోవ‌డంతో గ్రామస్థులు అంబులెన్స్‌కు ఫోన్ చేశారు. బాధితుడిని పాపడహండిలోని ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం నబరంగ్‌పూర్‌లోని జిల్లా ప్రధాన ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్ర‌స్తుతం అయితే అత‌డి ప‌రిస్థితి నిల‌క‌డ‌గానే ఉంద‌ని డాక్ట‌ర్లు చెబుతున్నారు.