స్పైస్‌ జెట్ విమానంలో పొగలు చెలరేగడం తీవ్ర కలకలం రేపింది. ఢిల్లీ నుంచి జబల్‌పూర్ బయలుదేరిన స్పైస్ జెట్ విమానంలోని ప్రయాణికుల క్యాబిన్‌లో పొగలు వస్తున్నట్లు సిబ్బంది గమనించారు. 

స్పైస్‌ జెట్ విమానంలో పొగలు చెలరేగడం తీవ్ర కలకలం రేపింది. ఢిల్లీ నుంచి జబల్‌పూర్ బయలుదేరిన స్పైస్ జెట్ విమానంలో ప్రయాణికుల క్యాబిన్‌లో పొగలు వస్తున్నట్లు సిబ్బంది గమనించారు. విమానం 5,000 అడుగుల ఎత్తులో ఉన్న సమయంలో క్యాబిన్‌లో పొగలు వచ్చాయి. దీంతో జబల్‌పూర్‌కు బయలుదేరిన స్పైస్‌జెట్ విమానం తిరిగి ఢిల్లీకి చేరుకుందని ఏఎన్‌ఐ వార్తా సంస్థ పేర్కొంది. క్యాబిన్‌లో పొగలు రావడంతో ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందిపడ్డారు. ఇందుకు సంబంధించి ఏన్‌ఐ వార్తా సంస్థ ట్వీట్ చేసిన వీడియోలో.. ఫ్లైట్‌లోని ప్రయాణికుల క్యాబిన్ పొగతో నిండి ఉన్నట్టుగా కనిపించింది. అయితే ప్రయాణికులు అంతా క్షేమంగా ఉన్నట్టుగా సమాచారం. 

‘‘ఢిల్లీ నుంచి జబల్‌పూర్‌కు వెళ్తున్న స్పైస్‌జెట్ విమానం ఈ రోజు ఉదయం ఢిల్లీ విమానాశ్రయానికి సురక్షితంగా తిరిగి వచ్చింది. సిబ్బంది 5000 అడుగులు దాటిన సమయంలో క్యాబిన్‌లో పొగను గమనించారు. ప్రయాణికులు సురక్షితంగా దిగారు’’ అని స్పైస్‌జెట్ ప్రతినిధి ఒకరు తెలిపినట్టుగా వార్తా సంస్థ పేర్కొంది. ఇక, ఈ ఘటనతో ప్రయాణికులు తీవ్ర ఆందోళన చెందారు.