అస్సాంను వరదలు వదలడం లేదు. దీంతో లక్షల మంది తీవ్ర అవస్థలకు లోనవుతున్నారు. ఇప్పటి వరకు ఈ వరదల వల్ల 173 మంది మరణించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 

వ‌ర‌ద‌ల‌తో అస్సాం అత‌లాకుత‌లం అవుతోంది. రోజు రోజుకు ఇక్క‌డ ప‌రిస్థితి మరింత దిగ‌జారుతోంది. అనేక ప్రాంతాల్లో ఇంకా నీటి మునిగే ఉన్నాయి. ప్ర‌జ‌లు నిత్య‌వ‌స‌ర వ‌స్తువుల కొర‌త‌తో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. క‌నీసం ఆహారం, నీరు, మందులు కూడా స‌రిగా దొరక్క అవ‌స్థ‌లు ప‌డుతున్నారు. ఈ రాష్ట్రంలో గ‌డిచిన 24 గంటల్లో మరో 14 మంది ప్రాణాలు మృతి చెందారు. దీంతో ఈ వ‌ర‌దలు, కొండ చ‌రియ‌లు విడిరిగిప‌డ‌టం వ‌ల్ల మే నెల నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు మృతి చెందిన వారి సంఖ్య 173కు చేరింది. 

AAP Tiranga Shakha: యూపీలో 1000 చోట్ల.. ఆర్‌ఎస్‌ఎస్ కు పోటీగా "ఆప్ తిరంగ శాఖ" ప్రారంభం

అస్సాం స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (ASDMA) ప్రకారం.. తాజా మరణాలలో కాచార్ జిల్లాలో ఆరు, నాగోన్‌లో మూడు, బార్‌పేటలో రెండు, కరీం‌గంజ్, కోక్రాజార్, లఖింపూర్‌లో ఒక్కొక్కటి చొప్పున నమోదయ్యాయి. శుక్రవారం నాటికి రాష్ట్రంలో వ‌ర‌ద ప్ర‌భావానికి గురైన వారి సంఖ్య 30 జిల్లాల్లో 29.70గా ఉంది. అంత‌కు ముందు రోజు ఈ సంఖ్య 29.80 లక్షలుగా ఉంది. బ్రహ్మపుత్ర, బెకి, కొపిలి, బరాక్, కుషియారా ఇంకా ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తున్నాయి.

Scroll to load tweet…

కాచర్ జిల్లాలోని సిల్చార్ పట్టణంలోని చాలా ప్రాంతాలు ఇప్పటికీ వరద నీటిలోనే ఉన్నాయి. రాష్ట్రంలోని ఏడు జిల్లాల్లోని కొన్ని వరద ప్రభావిత ప్రాంతాలను ఇంటర్ మినిస్టీరియల్ సెంట్రల్ టీమ్ (IMCT) సందర్శించింది. విపత్తు వల్ల కలిగే నష్టాన్ని వారు అంచ‌నా వేశారు. కాచర్ జిల్లాలో వరదల కారణంగా ప్రాణాలు కోల్పోయిన 24 మందిలో 10 మంది మృతుల బంధువులకు అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ శుక్రవారం ఒక్కొక్కరికి రూ.4 ల‌క్ష‌ల చొప్పున ఎక్స్‌గ్రేషియా పంపిణీ చేసినట్లు పీటీఐ పేర్కొంది. ఇతర మృతుల కుటుంబ సభ్యులకు దశలవారీగా ఎక్స్‌గ్రేషియా అందించ‌నున్నారు 

Maharashtra Politics: ఉద్ధవ్ ఠాక్రే సంచ‌ల‌న నిర్ణ‌యం.. షిండేను పార్టీ నుంచి బహిష్కరణ

సిల్చార్‌లో వరదలకు దారి తీసిన బేతుకుండి వాగును కూడా సీఎం హిమంత బిస్వా శర్మ సందర్శించారు. 10 రోజుల్లో బరాక్ వ్యాలీలో సీఎం పర్యటించడం ఇది మూడోసారి కావడం గమనార్హం. ఈ సందర్భంగా ఆయన కాచర్ల జిల్లా అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. కామ్రూప్ జిల్లాలో వరద పరిస్థితిని కూడా సీఎం పరిశీలించారు. ఈ క్యాచర్ జిల్లాలో దాదాపు 14 లక్షల మంది ప్రజలు ఈ వ‌ర‌ద ప్ర‌భావానికి గుర‌య్యారు. 88 రెవెన్యూ సర్కిళ్ల పరిధిలోని 2,450 గ్రామాలు ముంపునకు గురయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 563 సహాయ శిబిరాల్లో మూడు లక్షల మందికి పైగా ప్రజలు తలదాచుకుంటున్నారు. స‌హాయ‌క చ‌ర్య‌లు కొన‌సాగుతున్నాయి.