చేతబడి చేసిందనే నెపంతో ఓ మహిళ పట్ల పలువురు దారుణంగా ప్రవర్తించారు. ఆమె నివసిస్తున్న ఇంటికి నిప్పంటించారు. దీంతో ఆ మహిళ సజీవ దహనం అయ్యింది. ఈ ఘటన బీహార్ లో జరిగింది. 

టెక్నాలజీ ఎంతో పెరిగిపోతోంది. ఉన్న చోటు నుంచి ఎన్నో మైళ్ల దూరంలో నివసిస్తున్న వ్యక్తితో క్షణాల్లో మాట్లాడుతున్నాం. గంటల వ్యవధిలో ఖండాలు దాటి వెళ్తున్నాం. ప్రపంచంలో ఏం జరుగుతుందో అప్పటికప్పుడు తెలుసుకుంటున్నాం. ఇలా సమాజంలో ఎన్నో మార్పులు వస్తున్నా.. మనిషి మాత్రం కొన్ని మూడ విశ్వాసాలను పట్టుకొని ఇంకా వేళాడుతున్నాడు. ఆ మూడ నమ్మకాల వల్ల ఎన్నో అనర్థాలకు కూడా ఎగబడుతున్నాడు. హత్యలు చేయడానికి కూడా వెనకాడటం లేదు. ఇలాంటి ఘటనలు ఇటీవల కొన్ని బయటకు వచ్చాయి. తాజాగా బీహార్ లో నూ ఇలాంటి దారుణం ఒకటి జరిగింది.

దారుణం.. టీచర్ విధించిన పనిష్మెంట్ తట్టుకోలేక నాలుగో తరగతి బాలిక మృతి.. ఎక్కడంటే ?

బీహార్‌లోని గయా జిల్లాలో ఓ 45 ఏళ్ల మహిళను మంత్రగత్తెగా ముద్రవేసి సజీవ దహనం చేశారు. శనివారం మధ్యాహ్నం గయా జిల్లాలోని దుమారియా బ్లాక్ పరిధిలోని పంచ్వా గ్రామంలో ఈ సంఘటన జరిగింది. నిందితులు మహిళ ఇంట్లోనే నిప్పంటించారు. మృతురాలిని రీటా దేవిగా గుర్తించారు.

ఎలా బయటపడిందంటే ? 
పంచ్వా గ్రామంలో నివసించే చంద్రదేవ్ మాంఝీ కుమారుడు అనారోగ్యంతో ఇటీవల మరణించాడు. అతడి మరణానికి రీటానే కారణం అని మాంఝీ ఆరోపించింది. రీటా మంత్రగత్తె అని ముద్ర వేసింది. దీంతో శనివారం ఆమె కుటుంబ సభ్యులు, సహచరులు కలిసి రీటా దేవి ఇంటిపై దాడి చేశారు. అనంతరం ఆమె ఇంటికి నిప్పంటించారు. దీంతో ఆమె సజీవంగానే దహనం అయ్యింది. 

ఉగ్రవాద నిధుల కేసు.. దావూద్ ఇబ్రహీం, ఛోటా షకీల్‌పై చార్జిషీట్ దాఖలు చేసిన ఎన్‌ఐఏ

దీంతో మృతురాలి కుమారుడు అమిత్ కుమార్, ఆమె భర్త అర్జున్ దాస్ సహాయం కోరుతూ మైగ్రా పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. జరిగిన ఘటనను వివరించారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. కానీ అక్కడికి చేరుకున్న పోలీసులపైకి కూడా నిందితులు దాడి చేశారు. రాళ్లతో కూడా వారి వాహనాలను ధ్వంసం చేశారు. 

సైరస్ మిస్త్రీ కారు ప్రమాదం కేసులో ట్విస్ట్.. డాక్టర్ అనహిత పండోల్‌పై ఎఫ్ఐఆర్

దీంతో గ్రామంలో పోలీసులు అదనపు బలగాలను మోహరించారు. అనంతరం మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టంకు తరలించారు. కాగా .. ఈ ఘటనలో నిందితులు పరారీలో ఉన్నారు. వారిని పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. దీనిపై బాధితురాలి బంధువులు మాట్లాడుతూ.. నిందితులు రీటాపై మంత్రగత్తె అనే ముద్ర వేసేందుకు గ్రామంలో పంచాయితీ నిర్వహించారని, ఆమెను చంపేయాలని కోరారని ఆరోపించారు. ఇలాంటి ఘటనే రెండేళ్ల కిందట మేఘాలయాలో జరిగింది. క్షుద్రపూజలు చేస్తున్నాడనే నెపంతో 80 ఏళ్ల వృద్ధుడిని అతని సొంత కుటుంబీకులే చేతులు, కాళ్లు కట్టేసి బతికుండగానే పాతిపెట్టారు. ఈ ఘటనలో పోలీసులు 8 మందిని అరెస్ట్ చేశారు.