బీజేపీకి భయపడి ఎవరూ ఇతర పార్టీలకు విరాళాలు అందించడం లేదని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ అన్నారు. ఎలక్టోరల్ బాండ్ల ద్వారా బీజేపీకే 95 శాతం విరాళాలు అందుతున్నాయని తెలిపారు.
ఎలక్టోరల్ బాండ్ల ద్వారా అందజేసే మొత్తం విరాళాల్లో 95 శాతం భారతీయ జనతా పార్టీ (బీజేపీ) పొందుతోందని, దాతలు భయంతో ఇతర పార్టీలకు నిధులు అందించడం లేదని రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ అన్నారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ తరుఫున సూరత్ లో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్, ఇతర రాజకీయ పార్టీలకు విరాళాలు ఇవ్వాలనుకునే కార్పొరేట్‌లను కూడా బీజేపీ బెదిరిస్తోందని ఆయన ఆరోపించారు.
ఎద్దును ఢీకొన్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్.. నెలలో మూడో ఘటన!
ఇతర పార్టీలకు ఎవరైనా విరాళాలు అందజేస్తే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, ఆదాయపు పన్ను శాఖలు దాతల వారి ఇళ్ల తలుపు తడతాయని విమర్శించారు. మన ప్రజాస్వామ్యంలో విరాళాలు కూడా ఒక పార్టీకి వెళుతున్నాయని, వారు కోట్లాది రూపాయలను డిపాజిట్ చేశారని గెహ్లాట్ అన్నారు. ఎలక్టోరల్ బాండ్లను ప్రవేశపెట్టిన తర్వాత మొత్తం విరాళాల్లో 95 శాతం బీజేపీకి వస్తున్నాయని గెహ్లాట్ చెప్పారు. విరాళాల ద్వారా సేకరించిన సొమ్మును బీజేపీ మోడల్‌గా ప్రదర్శించిందని ఆయన అన్నారు. దేశవ్యాప్తంగా ఫైవ్ స్టార్ పార్టీ కార్యాలయాలను నిర్మించాలని, వారు కోట్లాది రూపాయలను కూడబెట్టారని చెప్పారు. మహారాష్ట్ర, కర్నాటకలో మాదిరిగానే రాష్ట్ర ప్రభుత్వాలను పడగొట్టడానికి వాటిని ఉపయోగిస్తున్నారని ఆరోపించారు.
‘‘గుజరాత్ మహాత్మా గాంధీ నడిచిన భూమి. కానీ ఇక్కడ హింస, అశాంతి వాతావరణం ఉంది. ఈ పరిస్థితి ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం. సమాజంలోని అన్ని వర్గాలు బీజేపీ పట్ల అసంతృప్తిగా ఉన్నాయి. ఈ పాలనను మార్చాల్సిన సమయం వచ్చింది. తదుపరి ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉంది. ’’ అని ఆయన అన్నారు.
ఆపరేషన్ లోటస్.. బీజేపీ ఆధ్యర్యంలో వికృత క్రీడ: ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా
ఈ సందర్భంగా ఆయన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), అరవింద్ కేజ్రీవాల్‌ను కూడా లక్ష్యంగా చేసుకొని వ్యాఖ్యలు చేశారు. ఆ పార్టీకి వ్యతిరేకంగా ఏవైనా ప్రతికూల వార్తలను ప్రచురిస్తే.. వాటిని అణిచివేసేందుకు డబ్బును ఖర్చు చేస్తోందని చెప్పారు. ‘‘ కేజ్రీవాల్ చేస్తున్నది ప్రజాస్వామ్యానికి కూడా ప్రమాదకరం. వారు (ఆప్) తమకు వ్యతిరేకంగా ఏవైనా ప్రతికూల వార్తలను అణిచివేసేందుకు డబ్బు ఖర్చు చేస్తారు. వారి ప్రకటనలను నిరంతరం నడుపుతున్నారు. వారి టీవీ ఇంటర్వ్యూలు కూడా నకిలీవి. గత మూడు నెలల్లో (వారిలో) అంతా మారిపోయిన వాతావరణాన్ని సృష్టించారు. అయితే అది నిజం కాదు.. వారి కుయుక్తులు ప్రజలకు తెలుసు ’’ అని అశోక్ గెహ్లాట్ అన్నారు.
కొత్త టెక్నాలజీని ఉగ్రవాద గ్రూపులు దుర్వినియోగం చేయకుండా ఆపాలి - విదేశాంగ మంత్రి జై శంకర్
ఇదిలా ఉండగా.. ఈ నెల ప్రారంభంలో ఎన్నికల సంఘం గుజరాత్ షెడ్యూల్‌ను నిలిపివేస్తూ హిమాచల్ ప్రదేశ్‌కు పోలింగ్ తేదీని ప్రకటించింది. అయితే గుజరాత్‌లో నవంబర్ లేదా డిసెంబర్‌లో ఓటింగ్ జరిగే అవకాశం ఉంది. ఈ రాష్ట్రంలో ఈ సారి ఎలాగైనా అధికారంలోకి రావాలని కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. అందుకే ఆ రెండు పార్టీలు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. అయితే బీజేపీ కూడా మరో సారి అధికారాన్ని నిలుపుకోవాలని ప్రయత్నిస్తోంది. ఈ రాష్ట్రానికి ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా 2001 నుండి 2014 వరకు ముఖ్యమంత్రిగా పనిచేశారు, ఆ తర్వాత ఆయన దేశానికి ప్రధానమంత్రి అయ్యారు.
