Asianet News TeluguAsianet News Telugu

ఎద్దును ఢీకొన్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్.. నెలలో మూడో ఘటన!

వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ మరోసారి పశువును ఢీకొంది. గతంలో ఒక సారి గేదెలను, మరోసారి గోవును ఢీకొన్న ఈ ట్రైన్ తాజాగా ఎద్దును ఢీకొట్టింది.
 

vande bharat express train hits bull
Author
First Published Oct 29, 2022, 4:26 PM IST

న్యూఢిల్లీ: గుజరాత్‌లో మరోసారి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ పశువును ఢీకొంది. నెల వ్యవధిలోనే ఇలాంటి ఘటన ఇది మూడోది. గుజరాత్‌లోని గాంధీ నగర్, మహారాష్ట్రలోని ముంబయికి మధ్య ప్రయాణించే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఈ రోజు ఉదయం ఓ ఎద్దును ఢీకొంది. గుజరాత్‌లో అతుల్ రైల్వే స్టేషన్ సమీపంలో ఉదయం 8.17 గంటల ప్రాంతంలో ఈ ఎక్స్‌ప్రెస్ ఓ ఎద్దును ఢీకొట్టింది. ఆ తర్వాత వందే భారత్ ఎక్స్‌ప్రెస్ 15 నిమిషాలు నిలిచిపోవాల్సి వచ్చింది.

ఎద్దును ఢీకొన్న కారణంగా వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ముందటి భాగం ధ్వంసమైంది. డ్రైవర్ కోచ్‌కు చెందిన ముందటి కప్పు విరిగిపోయింది. 

కొత్తగా సేవల్లోకి వచ్చిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఇటీవలే రెండు సార్లు పశువులను ఢీకొంది. తొలిసారి నాలుగు గేదెలను ఢీకొంది. ఆ తర్వాత రోజుల వ్యవధిలోనే ఓ గోవును ఢీకొట్టింది. గుజరాత్‌లో ఆనంద్ స్టేషన్ సమీపంలో ఈ గోవును ఢీకొట్టింది.

Also Read: గోవును ఢీకొన్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్.. రెండు రోజుల్లో రెండో ఘటన

కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విణి వైష్ణవ్ ఇలాంటి ఘటనలపై గతంలోనే స్పందించారు. పశువులను ఢీకొనే ఘటనలను నివారించలేమని తెలిపారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే ట్రైన్‌ను డిజైన్ చేసినట్టు వివరించారు.

Follow Us:
Download App:
  • android
  • ios