Asianet News TeluguAsianet News Telugu

కొత్త టెక్నాలజీని ఉగ్రవాద గ్రూపులు దుర్వినియోగం చేయకుండా ఆపాలి - విదేశాంగ మంత్రి జై శంకర్

కొత్త టెక్నాలజీని తీవ్రవాద గ్రూపులు దుర్వినియోగం చేయకుండా ప్రపంచ దేశాలు దృష్టి సారించాలని విదేశాంగ మంత్రి జై శంకర్ అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉగ్రవాద ముప్పు పెరుగుతోందని చెప్పారు. 

New technology must be stopped from being misused by terrorist groups - External Affairs Minister Jai Shankar
Author
First Published Oct 29, 2022, 3:27 PM IST

నాన్-స్టేట్ యాక్టర్స్ ద్వారా ఎన్‌క్రిప్టెడ్ మెసేజింగ్, క్రిప్టో-కరెన్సీ వంటి కొత్త సాంకేతికతలను ఉగ్రవాద గ్రూపులు దుర్వినియోగం చేయకుండా ఆపాలని భారత విదేశాంగ మంత్రి జై శంకర్  అన్నారు. ఢిల్లీలో శనివారం నిర్వహించిన యూఎన్ వో భద్రతా మండలిలోని ఉగ్రవాద నిరోధక కమిటీని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాద ముప్పు పెరుగుతోందని తెలిపారు. ముఖ్యంగా ఆసియా, ఆఫ్రికా దేశాల్లో తీవ్రవాద ఘటనలు పెరుగుతున్నాయని చెప్పారు. ఈ సందర్భంగా విదేశాంగ మంత్రి ఉగ్రవాదాన్ని మానవాళికి అతిపెద్ద ముప్పుగా అభివర్ణించారు.

మరింత బలహీనపడ్డ రూపాయి.. రెండేళ్ల కనిష్టానికి భారత ఫారెక్స్ నిల్వలు

ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి భారతదేశం నిబద్ధతగా వ్యవహరిస్తోందని ఆయన పునరుద్ఘాటించారు. ఈ ఏడాది భారత్ కూడా ఉగ్రవాద వ్యతిరేక యూఎన్ ట్రస్ట్ ఫండ్‌లో అర మిలియన్ డాలర్లను స్వచ్ఛందంగా అందిస్తోందని అన్నారు. గత రెండు దశాబ్దాల సాంకేతిక ఆవిష్కరణలు ప్రపంచం పని చేసే విధానంలో పరివర్తన తీసుకొచ్చాయని అన్నారు. బ్లాక్ చెయిన్, వర్చువల్ కరెన్సీలు ఆర్థిక, సామాజిక ప్రయోజనాల విస్తృత శ్రేణికి చాలా ఆశాజనకమైన భవిష్యత్తును అందిస్తున్నాయని పేర్కొన్నారు.

‘‘ఈ టెక్నాలజీలు ప్రభుత్వాలు, నియంత్రణ సంస్థలకు కూడా కొత్త సవాళ్లను విసురుతున్నాయి. ఈ టెక్నాలజీల్లో కొన్నింటి స్వభావాన్ని, నూతన నియంత్రణ వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకొని బయటి వ్యక్తులు దీనిని దుర్వినియోగం చేసే వీలుంది.’’ అని జై శంకర్ అన్నారు. ఇటీవలి కాలంలో తీవ్రవాద గ్రూపులు, వారి సైద్ధాంతిక భావజాలానికి అనుగుణంగా ఉన్న వారు ఈ టెక్నాలజీని వాడే సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుకుంటున్నారని తెలిపారు.

25 మంది ఎంవీఏ నాయ‌కుల స్పెష‌ల్ సెక్యూరిటీని తొల‌గించిన ఏక్ నాథ్ షిండే స‌ర్కారు

ఈ శక్తులు స్వేచ్ఛ, సహనం, పురోగతిపై దాడి చేయడానికి టెక్నాలజీని, డబ్బును, ముఖ్యంగా బహిరంగ సమాజాల నీతిని ఉపయోగిస్తాయని విదేశాంగ మంత్రి చెప్పారు. ‘‘ఇంటర్నెట్, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు సమాజాలను అస్థిరపరిచే లక్ష్యంతో ప్రచారం, రాడికలైజేషన్, కుట్ర సిద్ధాంతాలను వ్యాప్తి చేయడానికి ఉగ్రవాద, మిలిటెంట్ గ్రూపుల టూల్‌కిట్‌లో శక్తివంతమైన సాధనాలుగా మారాయి ’’ అని ఆయన పేర్కొన్నారు. 

ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వాలకు ఇప్పటికే ఉన్న ఆందోళనలకు తోడు ఉగ్రవాద గ్రూపులు, వ్యవస్థీకృత నేర నెట్‌వర్క్‌లతో మానవ రహిత వైమానిక వ్యవస్థలను ఉపయోగించడం మరింత ఆందోళన కలిగిస్తోందని అన్నారు. ఆయుధాలు, పేలుడు పదార్థాల పంపిణీ,  లక్షిత దాడులు వంటివి ఈ మానవరహిత వైమానిక ప్లాట్‌ఫారమ్‌లను ఉపయోగించి చేస్తున్నారని చెప్పారు. అందువల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న భద్రతా ఏజెన్సీలకు అవి సవాలుగా మారాయని తెలిపారు.

పంజాబ్‌లాగే గుజరాత్‌లోనూ.. మీకు ఎవరు సీఎం కావాలి?’ ప్రజలను అడిగిన అరవింద్ కేజ్రీవాల్

ఇవి కేవలం భారత్‌కే పరిమితం కాదని విదేశాంగ జై శంకర్ హెచ్చరించారు. ఆఫ్రికాలోని భద్రతా బలగాలు, ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షకుల కదలికలను పర్యవేక్షించడానికి ఉగ్రవాద గ్రూపులు డ్రోన్‌లను ఉపయోగించాయని చెప్పారు. ‘‘ కొన్ని నెలల క్రితం  పౌరులు, పౌర మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని యూఏఈ, సౌదీ అరేబియాపై సరిహద్దు డ్రోన్ దాడులను ఉగ్రవాదులు ప్రారంభించారు. ఇది అక్కడి భారతీయ పౌరుల చనిపోవడానికి, గాయాలు కావడానికి దారితీసింది’’ అని జయశంకర్ తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios