ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ప్రతాప్ గఢ్ జిల్లాలోని వాజిద్‌పూర్‌లో శుక్రవారం తెల్లవారుజామున 5.35 గంటల సమయంలో స్కార్పియో వాహనం, ట్రక్కు ఢీకొన్నాయి.

Also Read:షాకింగ్... 20 మంది మెట్రో సిబ్బందికి కరోనా

ఈ ప్రమాదంలో తొమ్మిది మంది అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారుగా తెలుస్తోంది. మరణించిన వారిలో ఐదుగురు పోలీసులు, ఇద్దరు చిన్నారులు ఉన్నారు.

ఈ ఘటనలో గాయపడిన మరో చిన్నారని లక్నోలోని ఆసుపత్రికి తరలించారు. రాజస్థాన్ నుంచి బీహార్‌లోని భోజ్‌పూర్ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు.

Also Read:మరో జార్జ్ ఫ్లాయిడ్ ఘటన.. ఈసారి భారత్ లో..

ఈ ఘటనలో స్కార్పియో పూర్తిగా ధ్వంసం అవ్వడంతో మృతదేహాలను బయటికి తీయడం కష్టంగా మారింది. చివరికి గ్యాస్ కట్టర్లను ఉపయోగించి అతికష్టం మీద మృతదేహాలను వెలికితీశారు. మృతులకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి వుంది.