అమెరికాలో ఇటీవల నల్లజాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ అతి దారుణంగా హత్యకు గురైన సంగతి తెలిసిందే. మే 25న డెరెక్ చావిన్ అనే పోలీసు అధికారి కారణంగా ఊపరి ఆడక మరణించాడు. ఇదే సమయంలో అక్కడే మరో ముగ్గురు పోలీసు అధికారులు ఉన్నారు. మెడపై ఊపిరాడనివ్వకంగా.. చేయడంతో జార్జ్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన నేపథ్యంలో అమెరికాలో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువయ్యాయి.

కాగా.. అచ్చం అలాంటి సంఘటనే ఒకటి భారత్ లో చోటుచేసుకుంది. జోధ్ పూర్ లో గురువారం అచ్చం ఇలాంటి సంఘటనే జరిగింది. జోధ్ పూర్ కి చెందిన ముఖేష్ కుమార్ ప్రజాపత్ అనే యువకుడిని పోలీసులు అలానే మెడపై ఒత్తిడి పెట్టి పట్టుకోవడం గమనార్హం.

 

యువకుడు.. బైక్ పై మాస్క్ వేసుకొని రోడ్డుపై తిరుగుతుండగా పోలీసులు అతనికి చాలానా విధించారు. అయితే.. సదరు యువకుడు పోలీసులనే బెదిరించే ప్రయత్నం చేశాడు. నన్ను ఎవరూ ఆపలేరు.. నాకు దూరంగా ఉండండి అంటూ పోలీసులను హెచ్చరించాడు. దీంతో... పోలీసులకు సదరు యువకుడి కి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

ఈ క్రమంలో సదరు యువకుడిని పోలీసులు పట్టుకున్నారు. ఈ క్రమంలో యువకుడు పోలీసులను కూడా కొట్టడానికి ప్రయత్నించాడు. దీంతో  అమెరికాలో జార్జ్ ఫ్లాయిడ్ ని పోలీసులు ఏవిధంగా అదుపుచేశారో.. అచ్చం అదేవిధంగా ఈ యువకుడిని కూడా కంట్రోల్ చేయడం గమనార్హం. కాగా.. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. 

ఇదిలా ఉండగా... జార్జ్ ఫ్లాయిడ్ కేసులో నలుగురు పోలీసులకు శిక్ష పడాలని అతని కుటుంబసభ్యులు డిమాండ్ చేశారు. నిరసనకారులు సైతం నలుగురు పోలీసు అధికారులకు శిక్ష పడాలంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. హత్య సమయంలో చావిన్‌కు మిగిలిన ముగ్గురు అధికారులు సహాయ పడినట్టు కోర్టు తేల్చింది. ఎట్టకేలకు మిగిలిన ముగ్గురు పోలీసు అధికారులు కూడా దోషులేనంటూ మిన్నెసొటా అటార్ని జనరల్ కీత్ ఎల్లిసన్ బుధవారం తీర్పిచ్చారు. న్యాయ మార్గంలో ఈ తీర్పు మరో ముందడుగు అని జార్జ్ ఫ్లాయిడ్ కుటుంబ తరపు న్యాయవాది బెంజామిన్ కూప్ ఆనందం వ్యక్తం చేశారు.

ఇదిలా ఉంటే.. చావిన్‌పై నమోదైన థర్డ్ డిగ్రీ మర్డర్‌ కేసును సెకండ్ డిగ్రీ మర్డర్‌ కింద మార్చుతూ కోర్టు తీర్పునిచ్చింది. థర్డ్ డిగ్రీ మర్డర్‌తో పోల్చితే సెకండ్ డిగ్రీ మర్డర్‌ కింద జైలుశిక్ష 15 ఏళ్లు ఎక్కువగా పడుతుంది. దీంతో చావిన్‌కు దాదాపు నలభై ఏళ్ల జైలుశిక్ష పడే అవకాశాలు కనపడుతున్నాయి