రేపటి నుండి మెట్రో సేవలకు అంతరాయం, ఉద్యోగుల సమ్మెతో...

9,000 Delhi Metro staff threaten strike
Highlights

పలు డిమాండ్ల పరిష్కారానికి...

దేశ రాజధాని డిల్లీలో మెట్రో సేవలకు అంతరాయం కలగనుంది. తమ డిమాండ్లను ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ పట్టించుకోవడం లేదని, అందువల్లే సమ్మెకు దిగుతున్నట్లు ఉద్యోగులు తెలిపారు. రేపు 9 వేల మంది ఉద్యోగులు సమ్మెలో పాల్గొననున్నారు.

డిల్లీ మెట్రో లో పనిచేసే ఉద్యోగులు ఇప్పటికే విధులు నిర్వహిస్తూనే నిరసన తెలుపుతున్న విషయం తెలిసిందే. ఈ నెల 19 వ తేధీ నుండి నల్ల రిబ్బన్లు ధరించి విధులకు హాజరవుతూ శాంతియుత నిరసన తెలిపారు. అయినా పట్టించుకోకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో సమ్మెకు దిగాల్సి వస్తోందని ఉద్యోగులు తెలిపారు.
 
దాదాపు 9 వేల మంది ఉద్యోగులు సభ్యులుగా గల యూనియన్‌కు గుర్తింపు ఇవ్వాలని, వేతనాల విషయంలో ఇదివరకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని వారు డిమాండ్ చేశారు. అలాగే మెట్రో స్టేషన్లలో పనిచేసే ఉద్యోగుల పని గంటలను తగ్గించాలని కోరుతున్నట్లు తెలిపారు. 

తాము ఏడాది నుండి పలు రూపాల్లో ఆందోళనలు చేపడుతున్న పట్టించుకోవడం లేదని అన్నారు. తమ డిమాండ్లు పరిష్కారమయ్యే వరకు నిరసనలు చేపడతామని ఉద్యోగులు తెలిపారు.
 

loader