Asianet News TeluguAsianet News Telugu

నవోదయ స్కూల్‌లో కరోనా కల్లోలం.. 85 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్

ఉత్తరాఖండ్‌లోని ఓ నవోదయ స్కూల్‌లో కరోనా కల్లోలం సృష్టించింది. ఏకంగా 85 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్‌గా తేలింది. నైనిటాల్ జిల్లాలోని జవహర్ నవోదయ విద్యాలయంలో ఎక్కువ మంది విద్యార్థులకు పాజిటివ్‌గా తేలడంతో మిగిలిన విద్యార్థులను అక్కడే ఐసొలేషన్‌లో ఉంచారు. వారికి ఆర్టీపీసీఆర్, ర్యాపిడ్ టెస్టులు చేసి.. నెగెటివ్ వస్తే డిశ్చార్జ్ చేయనున్నట్టు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఆ స్కూల్‌లో 600 మంది విద్యార్థులు ఉన్నట్టు తెలిసింది. కరోనా కేసులు భారీగా రిపోర్ట్ కావడంతో నవోదయ స్కూల్, దాని చుట్టుపక్కల ప్రాంతాన్ని కంటైన్‌మెంట్ జోన్‌గా అధికారులు గుర్తించారు.
 

85 students positive in navodaya school in uttarkhand
Author
Nainital, First Published Jan 2, 2022, 3:12 PM IST

నైనిటాల్: దేశవ్యాప్తంగా కరోనా కేసులు(Coronavirus Cases) విజృంభిస్తున్నాయి. అదే విధంగా ఉత్తరాఖండ్‌(Uttarakhand)లోనూ కేసులు పెరుగుతున్నాయి. నైనిటాల్‌లోని నవోదయ స్కూల్‌(Jawahar Navodaya School)లో మహమ్మారి కల్లోలం సృష్టించింది. ఏకంగా 85 మంది విద్యార్థుల(Students)కు పాజిటివ్(Positive) వచ్చింది. వీరితోపాటు 11 మంది స్కూల్ సిబ్బందికీ కరోనా సోకింది. కాగా, మిగిలిన విద్యార్థులు అందరినీ అదే పాఠశాలలో ఐసొలేషన్‌లో ఉంచింది. కేసులు ఒక్కసారిగా భారీగా రిపోర్ట్ కావడంతో ఆ స్కూల్ ఏరియాను కంటైన్‌మెంట్ జోన్‌గా అధికారులు ప్రకటించారు.

తొలుత ఈ స్కూల్‌లో సిబ్బంది సహా 11 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ తేలిందని డిప్యూటీ కలెక్టర్ రాహుల్ షా వెల్లడించారు. కానీ, కేసులు స్కూల్‌లో రిపోర్ట్ కావడంతో ఉత్తరాఖండ్ ఆరోగ్య శాఖ ప్రత్యేకంగా టెస్టింగ్ క్యాంప్ పెట్టిందని వివరించారు. ఇందులో సుమారు 490 మందికిపైగా విద్యార్థుల శాంపిళ్లను తీసుకున్నారని తెలిపారు. ఈ శాంపిళ్ల టెస్టులో 85 మంది చిన్నారులకు కరోనా సోకినట్టు వెల్లడైందని పేర్కొన్నారు. కరోనా కేసులు భారీగా రిపోర్ట్ కావడంతో ఆ స్కూల్‌ను, దాని చుట్టు పక్కల ప్రాంతాన్ని కంటైన్‌మెంట్ జోన్‌గా ప్రకటించినట్టు అధికారులు తెలిపారు. డిప్యూటీ కలెక్టర్ రాహుల్ షా సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు వివరించారు.

Also Read: Omicron:27వేలకు పైగా కరోనా కొత్త కేసులు.. పెరుగుతున్న ఒమిక్రాన్ వ్యాప్తి.. కొత్త‌గా ఎన్నంటే?

నైనిటాల్‌లోని సుయల్బరీలోని జవహర్ నవోదయ విద్యాలయంలో ఈ కేసులు బీభత్సం సృష్టించాయి. నైనిటాల్ జిల్లాలోని భవాలీ అల్మోరా ఎన్‌హెచ్ సమీపంలో ఈ స్కూల్ ఉన్నది. ఇందులో సుమారు 600 మంది విద్యార్థులు ఉన్నట్టు తెలిసింది. కరోనా టెస్టులో పాజిటివ్ వచ్చిన వారిని క్వారంటైన్‌లో ఉంచగా.. మిగిలిన విద్యార్థులను అదే స్కూల్‌లో ఐసొలేషన్‌లో ఉంచారు. వారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. మిగిలిన విద్యార్థులకూ ఆర్టీపీసీఆర్ టెస్టు చేశారు. నెగెటివ్ వస్తే.. విద్యార్థులను అక్కడి నుంచి డిశ్చార్జ్ చేయనున్నట్టు అధికారులు తెలిపారు.

బుధవారం తొలిసారిగా ఇక్కడ మూడు విద్యార్థులకు కరోనా టెస్టుల్లో పాజిటివ్ తేలింది. ఆ తర్వాత గురువారం మరో ఎనిమిది మంది విద్యార్థులకు పాజిటివ్‌గా రిపోర్ట్ వచ్చింది. ఆ స్కూల్ ప్రిన్సిపల్‌కు కూడా కరోనా సోకింది.

ఉత్తరాఖండ్‌లో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. సింగిల్ డే కేసులు సుమారు ఆరు నెలల తర్వాత తొలిసారి రాష్ట్రంలో వంద మార్క్‌ను దాటింది. శనివారం ఇక్కడ ఒకే రోజు 118 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. 34 మంది పేషెంట్లు రికవరీ కావడంతో రాష్ట్రంలో యాక్టివ్ పేషెంట్ల సంఖ్య 367కు చేరింది. జులై 3వ తేదీన 158 కరోనా కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత తొలిసారిగా కరోనా కేసులు శనివారం నాడు వందను దాటాయి.

Also Read: Omicron: అలెర్ట్.. ఆల్రెడీ మూడోవేవ్ వచ్చేసింది: సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్

కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆదివారం ఉదయం వెల్లడించిన కరోనా వైరస్ వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 27,553 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో వైరస్ తో పోరాడుతూ 284 మంది ప్రాణాలు కోల్పోయారు. యాక్టివ్ కేసులు సైతం పెరుగుతున్నాయి. ప్రస్తుతం దేశంలో 1,22,801 క్రియాశీల కేసులు ఉన్నాయి.  కొత్తగా 9,249 మంది కరోనా వైరస్ నుంచి బటయపడ్డారు. ఒమిక్రన్ కేసులు సైతం పెరిగాయి. ఇప్పటివరకు దేశంలో 1525 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios