సూపర్ హీరోలా స్టంట్‌ చేయబోయి.. స్కూల్ బిల్డింగ్ మీదినుంచి దూకిన 8యేళ్ల బాలుడు..

స్పైడర్‌మ్యాన్‌ స్టంట్స్ చూసి.. అతనిలా చేయాలనుకున్నాడో 8యేళ్ల చిన్నారి. స్కూల్ ఫస్ట్ బిల్డింగ్ మీదినుంచి దూకాడు. దీంతో తీవ్రగాయాలపాలయ్యాడు. 

8-year-old boy jumped from the school building to perform a stunt like a superhero, injured in uttar pradesh - bsb

కాన్పూర్ : కామిక్ హీరో స్పైడర్‌మ్యాన్‌ కు ఫ్యాన్ అయిన ఓ ఎనిమిదేళ్ల చిన్నారి.. అతనిలా స్టంట్ చేయాలనుకున్నాడు. దీనికోసం స్కూల్ బిల్డింగ్ మొదటి అంతస్తు నుంచి దూకాడు. తీవ్ర గాయాల పాలయ్యాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

బాబుపూర్వా కాలనీలో నివాసం ఉండే మెడికల్ స్టోర్ యజమాని ఆనంద్ బాజ్‌పాయ్ కుమారుడు విరాట్ బాజ్‌పాయ్. ఆ బాలుడు కిద్వాయ్ నగర్, హెచ్-2 బ్లాక్‌లోని డాక్టర్ వీరేంద్ర స్వరూప్ ఎడ్యుకేషన్ సెంటర్ స్కూల్‌లో 3వ తరగతి చదువుతున్నాడు. 

Oppenheimer: కశ్మీర్‌లో సినిమాకు మళ్లీ ప్రాణం.. నోలాన్ సినిమా ఫస్ట్‌డే హౌజ్‌ఫుల్.. 33 ఏళ్ల తర్వాత రికార్డు

ఆనంద్ తెలిపిన వివరాల ప్రకారం.. తన కుమారుడు బుధవారం మామూలుగానే పాఠశాలకు వెళ్లాడు. "కామిక్ హీరో స్పైడర్‌మ్యాన్‌ ఆ చిన్నారిని చాలా ఇంప్రెస్ చేసిందని, అతను చేసే స్టంట్స్ గురించే మాట్లాడేవాడు. ఆ రోజు కూడా అలాగే మాట్లాడాడని అతని స్నేహితులు చెప్పారు. ఆ తరువాత నీళ్లు తాగడం కోసం బయటకు వెళ్లాడు. స్పైడర్‌మ్యాన్ లా స్టంట్ చేయాలనుకున్నాడు. అలా బిల్డింగ్ ఫస్ట్ ఫ్లోర్ నుంచి కిందికి దూకినట్లు వారు చెప్పారు" అని ఆనంద్ అన్నాడు. 

అలా దూకడంతో విరాట్ బాజ్‌పాయ్ తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే గమనించిన పాఠశాల యాజమాన్యం బాలుడిని ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించి, తమకు సమాచారం ఇచ్చిందని విరాట్ బాజ్‌పాయ్ తండ్రి తెలిపాడు. అయితే, విద్యార్థి కుటుంబ సభ్యులు స్కూల్ యాజమాన్యంపై ఎలాంటి ఫిర్యాదు చేయలేదని కిద్వాయ్ నగర్ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ ప్రదీప్ సింగ్ తెలిపారు. విద్యార్థి తల్లిదండ్రులు అది తమ కుమారుడి తప్పని.. ఇందులో పాఠశాల యాజమాన్యం ఎలాంటి నిర్లక్ష్యం లేదని, సీసీటీవీ వీడియోల్లో అనుమానాస్పదంగా ఏమీ కనిపించలేదని చెప్పారు. 

ఈ ఘటనలో చిన్నారి దవడ, నాలుగు ముందు పళ్లు విరిగిపోయాయని వైద్యులు తెలిపారు. "దీనితో పాటు, అతని పెదవులపై గాయాలయ్యాయి. మోకాలి పొర చిరిగిపోయింది. ఇతర శరీర భాగాలపై కూడా కొన్ని తీవ్రమైన గాయాలు ఉన్నాయి" అని వారు తెలిపారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios