Oppenheimer: కశ్మీర్‌లో సినిమాకు మళ్లీ ప్రాణం.. నోలాన్ సినిమా ఫస్ట్‌డే హౌజ్‌ఫుల్.. 33 ఏళ్ల తర్వాత రికార్డు

జమ్ము కశ్మీర్‌లో హాలీవుడ్ మూవీ ఓపెన్‌హైమర్ హౌజ్‌ఫుల్. ఏకైక మల్టిప్లెక్స్‌లో మరో మూడు రోజులకు టికెట్లు అమ్ముడుపోయాయి. నోలాన్ ఫ్యాన్స్, హాలీవుడ్ మూవీలకు కశ్మీరీలకు అభిమానులు పెద్ద ఎత్తున ఉన్నారని స్పష్టమైంది. 33 ఏళ్ల తర్వాత మళ్లీ ఈ ఐనాక్స్‌లో హౌజ్‌ఫుల్ సాధించిన సినిమాగా ఓపెన్‌హైమర్ రికార్డులు నెలకొల్పింది.
 

nolan film oppenheimer housefull in kashmirs only multiplex, tickets sold out for three days, first time after 33 years kms

శ్రీనగర్: జమ్ము కశ్మీర్ అంటే ప్రధానంగా రెండు విషయాలతో వార్తల్లోకి వస్తుంటుంది. ఒకటి ఉగ్రవాదుల ఎన్‌కౌంటర్, మరొకటి అమర్నాథ్ యాత్రకు సంబంధించిన వివరాలు వస్తుంటాయి. చాలా వరకు విషాద వార్తలే మనం ఎక్కువగా చూస్తుంటాం. కానీ, క్రిస్టఫర్ నోలాన్ దర్శకత్వంలో వచ్చిన ఓపెన్‌హైమర్ హాలీవుడ్ మూవీ.. కశ్మీర్‌ గురించి ఓ గుడ్ న్యూస్ చెప్పింది. కశ్మీర్‌లో ఒకే ఒక మల్టిప్లెక్స్ ఉన్నది. ఓపెన్‌హైమర్ సినిమా ఫస్ట్ డే రోజున ఈ మల్టిప్లెక్స్ హౌజ్ ఫుల్ అయింది. మరికొన్ని రోజుల షోలకు ఇప్పుడే టికెట్లు అయిపోయాయని మల్టిప్లెక్స్ యాజమాన్యం చెప్పింది. ఈ రెస్పాన్స్‌ను తామే నమ్మలేకపోతున్నామని ఆశ్చర్యపోయింది.

గత కొన్నేళ్లుగా ఉగ్రవాద దాడులు, ప్రతిదాడులతో కశ్మీర్‌ రక్తమోడుతూనే ఉన్నది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత కఠిన ఆంక్షలతోనూ కశ్మీరీలు ప్రాణాల కోసం పెనుగులాడారు. ఇప్పటికీ కశ్మీర్‌కు ఎన్నికైన ప్రతినిధులే లేరు.

కశ్మీర్‌ ఉగ్రబెడద కారణంగా 1989 నుంచి ఇక్కడ మల్టిప్లెక్స్ మూసే ఉన్నది.  కశ్మీరీలకు మల్టిప్లెక్స్‌లో సినిమాలు అందని ద్రాక్షగానే ఉండిపోయింది. కానీ, మళ్లీ ఈ మధ్యే గతేడాది సెప్టెంబర్‌లో ఈ మల్టిప్లెక్స్‌ను రీఓపెన్ చేశారు. షారూఖ్ ఖాన్ పఠాన్ సినిమాతో మళ్లీ కొంత ఊపు కనిపించింది. చాలా మంది థియేటర్లకు మళ్లారు. ఇప్పుడు మోస్ట్ యాంటిసిపేటెడ్ ఓపెన్‌హైమర్ సినిమాతో కశ్మీర్ సినీ ప్రేమికులు మల్టిప్లెక్స్ వైపు నడిచారు. ఫస్ట్ డే మల్టిప్లెక్స్ హౌజ్‌‌‌ఫుల్ అయింది. మరో మూడు రోజుల పాటు టికెట్లు అమ్ముడుపోయాయి.

కశ్మీర్‌లోని మల్టిప్లెక్స్ ఐనాక్స్ ఓనర్ వికాస్ ధర్ మాట్లాడుతూ.. మరో కొన్ని రోజుల వరకు టికెట్లు అమ్ముడుపోయాయి. మా అంచనాలను ఈ సినిమా దాటేసిది. ఒక హాలీవుడ్ సినిమా ఈ స్థాయి ఆదరణ పొందుతుందని ఆలోచనకే రాలేదు. షారుఖ్ ఖాన్ సినిమా పఠాన్ ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడంలో ఒక టర్న్ పాయింట్ తెచ్చింది. ఓపెన్‌హైమర్ హౌజ్‌ఫుల్‌ సాధించింది.’ అని అన్నారు.

Also Read: ఆర్టికల్ 370 రద్దు వ్యతిరేక పిటిషన్లపై ఆగస్టు 2న సుప్రీంకోర్టు విచార‌ణ‌..

బాలీవుడ్‌కు సమాంతరంగా కశ్మీర్‌లోనూ సినిమాకు చరిత్ర ఉన్నది. బొంబాయ్‌లో బొంబాయ్ టాకీస్ మూవీ స్టూడియో ప్రారంభమైన రెండేళ్లకే శ్రీనగర్‌లో 1932లో తొలి సినిమా కశ్మీర్ టాకీ మొదలైంది. బాలీవుడ్ సహా అనేక సినిమాలు కూడా కశ్మీర్‌ థియేటర్‌లలో రిలీజ్ అయ్యేవి. ఆదరణ పొందేవి. అందులో హాలీవుడ్ సినిమాలు కూడా ఉండేవి.

కానీ, గత కొన్నేళ్లుగా కశ్మీర్‌ ఒక భారీ కుదుపుకు లోనవుతున్నది. ఇప్పటికీ ఇంకా పూర్తిగా తేరుకోలేదు. అక్కడ అసెంబ్లీ ఎన్నికల కోసం కొన్నేళ్లుగా ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ సందర్భంలో ఓపెన్‌హైమర్ సినిమా హౌజ్‌ఫుల్ సాధించడం కశ్మీరీలు తిరిగి సాధారణ స్థితికి వస్తున్నారనే సంకేతాలను ఇస్తున్నది.

అమెరికన్ ఫిజిసిస్ట్ రాబర్ట్ ఓపెన్‌హైమర్ జీవిత కథ పుస్తకం ఆధారంగా ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు క్రిస్టఫర్ నోలాన్ రచన, దర్శకత్వంలో ఈ సినిమా వచ్చింది. రెండో ప్రపంచ యుద్ధంలో అత్యంత వినాశక బాంబు ఆటమ్ బాంబ్‌ను తయారు చేయడంలో ఓపెన్‌హైమర్‌ది ప్రధాన పాత్ర. ఆయననే ఆటమ్ బాంబ్ పితామహుడుగా పేర్కొంటారు. ఆయన విషాద జీవిత గాథను తెరకెక్కించారు. ఆయన జీవితమే కాదు.. నోలాన్‌కు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉన్నది. ఆయన తీసిన ఇన్సెప్షన్, ది డార్క్ నైట్, ది ప్రెస్టీజ్, డన్‌కిర్క్, ఇంటర్‌స్టెల్లార్ సినిమాలు ఆయనకు విశేష అభిమానులను తెచ్చిపెట్టాయి. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios