భారత్ లో తొలి కరోనా మరణం.. హైదరాబాద్ లో కర్ణాటక వ్యక్తి మృతి

 జలుబు, జ్వరం, దగ్గు లక్షణాలతో అస్వస్థత మొదలైంది. వీటితోపాటు ఆస్థమా, హైపర్ టెన్షన్ వంటివి కూడా తోడయ్యాయి. దీంతో అతనిని   చికిత్స నిమిత్తం హైదరాబాద్ కి తరలించారు. అక్కడే ఆయన ప్రాణాలు వదిలారు. అయితే.. అతనికి చేసిన పరీక్షల్లో కరోనా సోకినట్లు నిర్థారణ అయ్యింది. 

76-Year-Old Karnataka Man Who Died On Tuesday Had Coronavirus: Officials

ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా మహమ్మారి భారత్ కి కూడా పాకేసింది. భారత్ లో  తొలి కరోనా మరణం సంభవించింది. 76ఏళ్ల వృద్ధుడు కరోనా వైరస్ సోకి ప్రాణాలుు కోల్పోయాడు. సదరు వ్యక్తి కర్ణాకటకు చెందినవాడు కాగా... చనిపోయింది మాత్రం హైదరాబాద్ నగరంలో కావడం గమనార్హం. 

Also Read కరోనా ఎఫెక్ట్... 36గంటలుగా ఎయిర్ పోర్టులోనే .....

ఈ విషయాన్ని కర్ణాటక మంత్రి శ్రీరాములు వెల్లడించారు. అతడి మరణానికి కరోనానే కారణమని నిర్ధారణ అయినట్టు చెప్పారు. దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్‌లో కరోనా మరణం సంభవించడం నగర వాసులను భయభ్రాంతులకు గురిచేస్తోంది.

మార్చి 5వ తేదీన ఆయన అస్వస్థతకు గురైనట్లు తొలుత గుర్తించారు. దీంతో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం చేర్పించారు. జలుబు, జ్వరం, దగ్గు లక్షణాలతో అస్వస్థత మొదలైంది. వీటితోపాటు ఆస్థమా, హైపర్ టెన్షన్ వంటివి కూడా తోడయ్యాయి. దీంతో అతనిని   చికిత్స నిమిత్తం హైదరాబాద్ కి తరలించారు. అక్కడే ఆయన ప్రాణాలు వదిలారు. అయితే.. అతనికి చేసిన పరీక్షల్లో కరోనా సోకినట్లు నిర్థారణ అయ్యింది. 

మరోవైపు, ఈ మహమ్మారి వెలుగుచూసిన చైనాలోని హుబేయి ప్రావిన్సులో కొత్త కేసుల నమోదు సింగిల్ డిజిట్‌కు పడిపోగా, చైనా వెలుపల మాత్రం ఇది విజృంభిస్తోంది. ఇటలీ, ఇరాన్, దక్షిణ కొరియా వంటి దేశాల్లో కోరలు చాస్తోంది. కరోనా భయంతో ఇప్పటికే షెడ్యూల్‌లో ఉన్న కార్యక్రమాలన్నీ రద్దు అవుతున్నాయి. దేశంలో ఇప్పటి వరకు 74 కేసులు నమోదయ్యాయి. దీంతో ఐపీఎల్ సహా ఇతర మ్యాచ్‌లను ఖాళీ స్టేడియాల్లోనే నిర్వహించాలని బీసీసీఐ, ఇతర క్రీడా సమాఖ్యలకు కేంద్రం సూచనలు చేసింది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios