Asianet News TeluguAsianet News Telugu

కరోనా ఎఫెక్ట్... 36గంటలుగా ఎయిర్ పోర్టులోనే ...

ఆ పరీక్షలు చేయించుకోవడానికి విద్యార్థులు సిద్ధంగా ఉన్నప్పటికీ..కనీసం భారత రాయబారులతో మాట్లాడటానికి కూడా వారికి అవకాశం లేకుండా పోయింది. స్థానిక డాక్టర్లతో పరీక్షలు చేయించుకోవడానికి కూడా వీలులేకపోవడంతో.. విద్యార్థులు బిక్కుబిక్కుమంటున్నారు.

Coronavirus scare: Three Hyderabadis among 15 Indian students stuk at milan airport
Author
Hyderabad, First Published Mar 12, 2020, 12:31 PM IST

వారంతా ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లారు. అనుకోకుండా అక్కడ కరోనా కలకలం సృష్టించడంతో తిరిగి స్వదేశానికి రావాలని రెడీ అయ్యారు. అయితే.. వాళ్లను స్వదేశానికి రానీకుండా అక్కడి అధికారులు అడ్డుకుంటున్నారు. దీంతో దాదాపు 15మంది భారతీయ విద్యార్థులు మిలన్ విమానాశ్రయంలో ఇరుక్కుపోయారు. వారిలో ముగ్గురు హైదరాబాదీలు కూడా ఉండటం గమనార్హం.

పూర్తి వివరాల్లోకి వెళితే... మిలన్ లోని మల్పెన్సా విమానాశ్రయంలో అధికారులు దాదాపు 15మంది భారతీయ విద్యార్థులను నిలిపివేశారు. ఇప్పటికే వారు 36గంటలుగా విమానాశ్రయంలోనే ఎదురుచూస్తున్నారు. అయినా అధికారులు కనికరించకపోవడం గమనార్హం. కరోనా వైరస్ తమకు సోకలేదు అంటూ.. మెడికల్ సర్టిఫికేట్ చూపిస్తేనే విమానంలోకి అనుమతిస్తామంటూ అధికారులు చెప్పడం గమనార్హం. 

Also Read కరోనా భయం.. ఆన్ లైన్ లో ఫుడ్ మాకొద్దు బాబోయ్..!

ఆ పరీక్షలు చేయించుకోవడానికి విద్యార్థులు సిద్ధంగా ఉన్నప్పటికీ..కనీసం భారత రాయబారులతో మాట్లాడటానికి కూడా వారికి అవకాశం లేకుండా పోయింది. స్థానిక డాక్టర్లతో పరీక్షలు చేయించుకోవడానికి కూడా వీలులేకపోవడంతో.. విద్యార్థులు బిక్కుబిక్కుమంటున్నారు.

తాము కరోనా నిర్ధారిత పరీక్షలు చేయించుకోలేదని..కనీసం తమకు ఎవరూ సహాయం కూడా చేయడం లేదని ఓ విద్యార్థిని తేజశ్రీ చెప్పారు. ఆమె బయోటెక్నాలజీ లో మాస్టర్స్ చేయడానికి ఇటలీ వెళ్లారు. కాగా.. వారు మంగళవారమే విమానం ఎక్కాల్సి ఉంది. అధికారులు అనుమతించకపోవడంతో.. వారు బుక్ చేసుకున్న ఎయిర్ ఇండియా విమానం విద్యార్థులు లేకుండానే వెళ్లిపోయింది. 

దీంతో విద్యార్థులకు ఏం చేయాలో పాలుపోక ఎయిర్ పోర్టులోనే ఎదురుచూస్తున్నారు. అయితే.. అక్కడి అధికారులు మాత్రం విద్యార్థులను అక్కడి నుంచి వెళ్లిపోవాల్సిందిగా చెబుతున్నారు. దీంతో.. ఆ విద్యార్థులంతా సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. వారిని భారత్ కి పంపేందుకు భారత రాయబార కార్యాలయ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios