Asianet News TeluguAsianet News Telugu

Independence Day 2022 : 75వ స్వాతంత్య్ర దినోత్సవ షెడ్యూల్ ఇదే...

75వ స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించి, జాతి మొత్తాన్ని ఉద్దేశించి ప్రసంగం చేస్తారు. ఈ సందర్భంగా స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమం పూర్తి షెడ్యూల్ ఇలా ఉంది..

75th Independence Day : Flag Hoisting Time and full Event details
Author
Hyderabad, First Published Aug 15, 2022, 7:40 AM IST

న్యూఢిల్లీ : భారతదేశం 75 వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకుంటోంది. ఆజాద్ ఇక అమృత మహోత్సవ పేరుతో ఈ వేడుకలు నిర్వహిస్తున్నారు. హర్ ఘర్ తిరంగా ప్రచారం ఈ సంవత్సరం స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రత్యేకంగా నిలిచింది. ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా జాతీయ జెండా ఎగరవేయడానికి ప్రజలని ప్రోత్సహిస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించి, జాతి మొత్తాన్ని ఉద్దేశించి ప్రసంగం చేస్తారు. ఈ సందర్భంగా స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమం పూర్తి షెడ్యూల్ ఇలా ఉంది..

హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకారం, స్వాతంత్య్ర దినోత్సవాన  జెండా ఎగురవేసే సమయాన్ని ప్రకటించారు.  ఉదయం 7.30 గంటలకు ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగం అనంతరం జెండా ఎగురవేత కార్యక్రమం ఉంటుంది. జాతీయ టెలివిజన్ ఛానెల్ లు, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్స్ లో ఈవెంట్ను ప్రత్యక్షంగా చూడవచ్చు. ఇది కాకుండా వివిధ ఆన్లైన్ స్ట్రీమింగ్ ఛానల్ లు, టెలివిజన్ ఛానళ్లలో ను వీటిని చూడవచ్చు.

- ఉదయం 7.06 - మహాత్మా గాంధీ సమాధి అయిన రాజ్ ఘాట్ వద్ద ప్రధాని మోడీ పూలమాలలు వేస్తారు.
- ఉదయం 7.14 -  గంటలకు  రాజ్ ఘాట్ నుంచి  ఎర్రకోట బయలుదేరుతారు.
- ఉదయం 7.18 - గంటలకు లాహోరీ గేట్ కు వెళ్లి ఆర్ ఎం, ఆర్ ఆర్ఎం, డిఫెన్స్ వందనాలు స్వీకరిస్తారు.
- 7:20 గంటలకు  ఎర్రకోట వద్ద గౌరవ గార్డ్ నిర్వహిస్తారు.
- 7:30 గంటలకు ప్రధానమంత్రి ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తారు.
- ఆయా రాష్ట్ర రాజధానులు, జిల్లా కేంద్రాలు, సబ్ డివిజన్లు, బ్లాక్ లు, గ్రామపంచాయతీలు, గ్రామాల్లో జాతీయ జెండాను ఎగురవేసి కార్యక్రమం ఉదయం 9 గంటల తర్వాత ప్రారంభం అవుతుంది.

ప్రభుత్వం జారీచేసిన మార్గదర్శకాల  ప్రకారం..
- ముందుగా ప్రధాని నరేంద్ర మోడీకి సాయుధ బలగాలు, ఢిల్లీ పోలీసులు గార్డ్ ఆఫ్ హానర్ ఇవ్వనున్నారు.
- జాతీయ గీతాలాపనతో పాటు జాతీయ జెండాను ఎగుర వేయడం తో పాటు 21 తుపాకుల గౌరవ వందనం కూడా ఉంటుంది. - మొట్టమొదటిసారిగా  దేశీయ హోవిట్జర్ గన్, ATAGS, ఉత్సవ 21- గన్ సెల్యూట్ లో  ఉపయోగించనున్నారు. ఈ తుపాకీ పూర్తిగా స్వదేశీ, DRDOచే రూపొందించింది,
- భారత వైమానిక దళం హెలికాప్టర్ల పై పూల వర్షం కురిపిస్తుంది.
- ప్రధాని మోడీ ప్రసంగం తరువాత జాతీయగీతం ఆలపిస్తారు.
- వేడుకలముగింపు సందర్భంగా ఆకాశంలో త్రివర్ణ బెలూన్లను ఎగరవేస్తారు.
- తదుపరి కార్యక్రమం ఎట్ హోమ్ రిసెప్షన్కు రాష్ట్రపతి భవన్ లో ఏర్పాటు చేశారు.
-ఎన్ సిసి స్పెషల్ యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాం కింద 14 వేర్వేరు దేశాల నుంచి 26 మంది అధికారులు/ పర్యవేక్షకులు, 127 మంది క్యాడెట్లు లేదా యువకులు మొదటిసారిగా ఎర్రకోటలోకి ప్రవేశిస్తారు.
- ఈసారి అంగన్వాడీ కార్యకర్తలు, వీధి వ్యాపారులు, ముద్ర యోజన రుణాలు పొందిన వారు, శవాగార  కార్యకర్తలకు ప్రత్యేక ఆహ్వానం అందింది.

 ఎర్రకోటకు చేరుకున్న తర్వాత ప్రధానికి రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్.  రక్షణ శాఖ సహాయ మంత్రి  అజయ్ భట్, రక్షణ కార్యదర్శి డాక్టర్ అజయ్ కుమార్ స్వాగతం పలుకుతారు. డిఫెన్స్ సెక్రెటరీ జనరల్ ఆఫీసర్ కమాండింగ్ ఢిల్లీ లెఫ్ట్నెంట్ జనరల్ విజయ్ కుమార్ మిశ్రా, ఏవీఎస్ఎమ్ ని ప్రధానికి పరిచయం చేస్తారు. ఆ తర్వాత జీవోసీ ఢిల్లీ జోన్  నరేంద్ర మోదీని సెల్యూటింగ్ జోన్ వద్దకు తీసుకు వెడుతోంది. అక్కడ సంయుక్త ఇంటర్-సర్వీసెస్, ఢిల్లీ పోలీస్ గార్డ్ ప్రధాన మంత్రికి సాధారణ వందనం అందజేస్తారు. ఆ తర్వాత ప్రదాన మంత్రిగార్డు ఆఫ్ ఆనర్ ను పరిశీలించనున్నారు. 

ప్రధాని కోసం గార్డ ఆఫ్ హానర్ బృందంలో ఆర్మీ, నేవీ, వైమానిక దళం, ఢిల్ల పోలీసుల నుంచి ఒక్కొక్క అధికారి, 20మంది పురుషులు ఉంటారు. గార్డ్ ఆఫ్ హానర్ కు వింగ్ కమాండర్ కునాల్ ఖన్నా నాయత్వం వహిస్తారు. ప్రైమ్ మినిస్టర్స్ గార్డలోని వైమాని దళానికి స్వ్కాడ్రన్ లీడర్ లోకేంద్ర సింగ్, ఆర్మీ కంటెంజెంట్ కు మేజర్ వికాస్ సంగ్వాన్, నావికా దళానికి లెఫ్టినెంట్ కమాండర్ అవినాష్ కుమార్ నాయకత్వం వహిస్తారు. ఢిల్లీ పోలీసు బృందానికి అదనపు డీసీపీ అచిన్ గార్గ్ నాయకత్వం వహిస్తారు 

గార్డ్ ఆఫ్ ఆనర్ ను పరిశీలించిన తరువాత, ప్రధాని నరేంద్ర మోడీ ఎర్రకోట ప్రాకారానికి చేరుకుంటారు. అక్కడ రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్ భట్, ఆర్మీ స్టాఫ్ చీఫ్ జనరల్ మనోజ్ పాండ్ ఆయనకు స్వాగతం పలుకుతారు. ఆర్మీ స్టాఫ్ చీఫ్ జనరల్ మనోజ్ పాండే, నావల్ స్టాఫ్ అడ్మిరల్ ఆర్ హరి కుమార్, చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ విఆర్ చౌదరి కూడా ఉంటారు. జీవోసీ ఢిల్లీ ప్రాంతం జాతీయ జెండాను ఎగురవేసేందుకు ప్రధానమంత్రిని ప్రాకారంపై వేదికపైకి తీసుకువెడుతుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios