ముజఫర్ నగర్: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని సామ్లీలో బుధవారం ఏడేళ్ల బాలుడిని దారుణంగా హత్య చేశారు. సమీర్ అనే బాలుడిని గొంతు నులిమి చంపేశారని పోలీసు సూపరింటిండెంట్ దినేష్ కుమార్ చెప్పారు. 

బాలుడి చేతులు, కాళ్లు, నాలుక కోసేశారని ఆయన చెప్పారు. గుర్తు తెలియని వ్యక్తులు ఈ దారుణానికి పాల్పడినట్లు ఆయన తెలిపారు. సామ్లీలోని ఆదర్శ్ మండి పొలాల్లో బాలుడి శవం కనిపించింది.

ఇంటి ముందు ఆడుకుంటుండగా గుర్తు తెలియని వ్యక్తులు మంగళవారంనాడు బాలుడ్ని కిడ్నాప్ చేశారు. కేసు నమోదు చేసి శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నిందితుల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.