Asianet News TeluguAsianet News Telugu

అక్రమంగా అబార్షన్లు చేసి.. పిండాలను బాక్సులో పెట్టి పడేశారు.. విచారణకు ఆదేశాలు...

కర్ణాటకలో పిండాలు లభ్యం: బెళగావి జిల్లాలోని ముదలగి పట్టణంలోని బస్టాప్ సమీపంలో స్థానికులు పిండాలను గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.

7 Aborted Fetuses Found In Canister In Karnataka, Probe Ordered
Author
Hyderabad, First Published Jun 25, 2022, 9:49 AM IST

కర్నాటక : కర్ణాటకలో ఓ హృదయవిదారక ఘటన వెలుగులోకి వచ్చింది. కర్ణాటకలోని బెలగావి జిల్లా మూడలగి గ్రామ శివార్లలో శుక్రవారం ఒక డబ్బాలో ఏడు Aborted Fetuses అవశేషాలు బయటపడ్డాయి. దీన్ని గమనించిన స్థానికులు మొదట షాక్ అయ్యారు. ఆ తరువాత పోలీసులకు సమాచారం అందించారు. ఈ షాకింగ్ ఘటనపై రాష్ట్ర ఆరోగ్య శాఖ విచారణకు ఆదేశించింది.

బెళగావి జిల్లా ముదలగి పట్టణంలోని బస్టాప్ సమీపంలో స్థానికులు ఈ బాక్స్ ను చూశారు. అనుమానాస్పదంగా కనిపించడంతో వారు ధైర్యం చేసి దాన్ని తెరిచి చూడగా అందులో గర్భస్రావం చేసిన పిండాలు కనిపించాయి. వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని సందర్శించి పరిశీలించారు.

నేను ఈ గర్భాన్ని మోయలేను.. అబార్షన్‌కు అనుమతివ్వండి, కోర్టుకి సంచలన విషయాలు చెప్పిన మహిళ

"ఒక డబ్బాలో ఏడు పిండాలు కనిపించాయి. అన్నీ ఐదు నెలల పిండాలుగా తెలుస్తున్నాయి. గర్భస్థశిశువు  లింగనిర్ధారణ చేయడం ద్వారా హత్య చేసినట్లు గుర్తించబడ్డాయి. జిల్లా అధికారులకు సమాచారం అందించిన వెంటనే అధికారుల బృందంగా ఏర్పడి విచారణ జరుపుతుంది" అని జిల్లా ఆరోగ్య, కుటుంబ సంక్షేమాధికారి డాక్టర్ మహేష్ కోని మీడియా ప్రతినిధులకు తెలిపారు.

అతను ఇంకా మాట్లాడుతూ, "ఈ దొరికిన పిండాలను మొదట దగ్గర్లోని ఆసుపత్రిలో బధ్రపరిచారని, ఆ తరువాత పరీక్ష కోసం జిల్లా ఫంక్షనల్ సైన్స్ సెంటర్‌కు తీసుకువచ్చారని" తెలిపారు. ఈ విషయమై పోలీసు కేసు నమోదైంది. తదుపరి విచారణ జరుగుతోందని కూడా చెప్పుకొచ్చారు. 

సిస్టర్ ఫ్రెండ్‌తో శారీరక సంబంధం.. గర్భం దాల్చడంతో మందు కలిపిన డ్రింక్ ఇచ్చి..

ఇదిలా ఉండగా, జూన్ 17న హైదరాబాద్, జవహర్ నగర్ కార్పొరేషన్ పరిధిలో మరో ఘటన చోటు చేసుకుంది.  జవహర్ నగర్ కు చెందిన 14 ఏళ్ల బాలిక తండ్రి మరణించడంతో..  తల్లి కూలీ పనికి వెళుతూ పిల్లల్ని పోషిస్తోంది. ఆమె ఇంటి పక్కనే ఉన్న ఓ వ్యక్తి ఆ బాలికపై కన్నేశాడు. రెండు నెలల క్రితం తల్లి కూలి పనికి వెళ్ళగా.. ఇంట్లో ఒంటరిగా ఉన్న ఆ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు.  ఎవరికైనా విషయం చెబితే చంపేస్తానని హెచ్చరించాడు. 

ఆ తర్వాత పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇటీవల ఆ బాలిక తీవ్ర కడుపు నొప్పితో బాధ పడుతుండడంతో ఆమెను ఆ దుర్మార్గుడు ఓ ఆర్ఎంపి వైద్యుడికి చూపించాడు. బాలిక వయస్సు 20 ఏళ్లుగా పేర్కొని స్కానింగ్ చేయించాడు. గర్భం దాల్చినట్లు నిర్ధారణ కావడంతో అబార్షన్ చేయించాడు. బాలిక తల్లికి ఈ విషయం తెలియడంతో.. గురువారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios