Asianet News TeluguAsianet News Telugu

యూపీలో రెండు ట్రక్కులు ఢీ: ఆరుగురు రైతుల మృతి

ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని ఎతావా ప్రాంతంలో బుధవారం నాడు ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు రైతులు మృతి చెందారు. 
 

6 farmers killed in collision between 2 trucks in UPs Etawah
Author
Lucknow, First Published May 20, 2020, 10:43 AM IST


లక్నో:ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని ఎతావా ప్రాంతంలో బుధవారం నాడు ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు రైతులు మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. 

రైతులు కూరగాయలను మార్కెట్లో విక్రయించుకొని తిరిగి ఇంటికి  మినీ ట్రక్కులో వస్తున్న సమయంలో వేగంగా వస్తున్న మరో ట్రక్కు ఎటావా ఫ్రెండ్స్ కాలనీ వద్ద ఇవాళ తెల్లవారుజామున ఢీకొంది. 

also read:నేడు, రేపు ఆంపన్ తుఫాన్ ప్రభావం: వణుకుతున్న ఒడిశా, బెంగాల్ తీర ప్రాంతాలు

దీంతో మిని ట్రక్కులో ప్రయాణిస్తున్న ఐదుగురు రైతులు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్టుగా  పోలీసు ఉన్నతాధికారి ఆర్ సింగ్ చెప్పారు.

మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించినట్టుగా పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల పరిహరం చెల్లించనున్నట్టుగా తెలిపారు. గాయపడిన వారికి రూ. 50 వేలను ప్రకటించింది ప్రభుత్వం.మంగళవారం నాడు ఒక్క రోజే దేశంలోని ఐదు రాష్ట్రాల్లో జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 22 మంది మృతి చెందారు. 

ఉత్తరప్రదేశ్‌లోని ఎతవాలో మంగళవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎతవాలోని ఫ్రెండ్స్‌ కాలనీలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. రెండు ట్రక్కులు ఢీకొనడంతో ఆరుగురు రైతులు ప్రాణాలు కోల్పోయారు. రైతులు పనస పండ్లను ట్రక్కులో మార్కెట్‌కు తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. పలువురు రైతులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సైఫాయి మెడికల్‌ కాలేజీకి తరలించారు. 

ఈ ప్రమాద ఘటనపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఒక్కో మృతుడి కుటుంబానికి రూ. 2 లక్షల చొప్పున నష్టపరిహారం ప్రకటించారు. క్షతగాత్రులకు రూ. 50 వేల చొప్పున పరిహారం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ. లక్ష చొప్పున పరిహారం ఇస్తున్నట్లు సమాజ్‌వాదీ పార్టీ ప్రకటించింది. 

Follow Us:
Download App:
  • android
  • ios