విశాఖపట్టణం: వాయివ్య దానిని ఆనుకొని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అతి తీవ్ర తుపాన్ ఉమ్ పున్  కేంద్రీకృతమైంది. ఈ తుఫాన్ వాయువ్య బంగాళాఖాతం మీదుగా ఉత్తర దిశకు ఆంఫాన్ దూసుకు వస్తోందని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు.

ఇవాళ  తెల్లవారు జామున 2:30 గం.ల సమయానికి పారాదీప్ కు దక్షిణంగా 180 కిలో మీటర్ల దూరంలో పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని దిఘాకు దక్షిణ నైరుతి దిశగా 320 కిలోమీటర్ల దూరాన తుఫాన్ కేంద్రీకృతమైందని ఐఎండీ తెలిపింది. 

బుధవారం నాడు సాయంత్రానికి దిఘా, హటియా దీవుల మధ్య సుందర్ బన్స్ సమీపంలో గంటకు 185 కిలోమీటర్ల  వేగంతో తీరందాటుతుందని వాతావరణ శాఖాధికారులు అంచనా వేశారు. దీని ప్రభావంతో ఇప్పటికే ఒడిసా, బెంగాల్ తీరప్రాంతాలు అల్లకల్లోలంగా ఉన్నాయి.నేడు, రేపు కూడా అతి తీవ్ర తుపాను ప్రభావం తీవ్రంగా కన్పించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. 

ఈ తుఫాన్ ప్రభావంతో బెంగాల్లో ఈస్ట్ మిడ్నపూర్, 24 పరగణాలు, హౌరా, హుగ్లీ, కొల్‌కత్తా జిల్లాలు అతలాకుతలం కానున్నాయని వాతావరణ శాఖ ప్రకటించింది. గురువారం నాడు ఉదయానికి తుఫాన్ బలహీన పడే అవకాశాలు ఉన్నాయి. ఈ ప్రభావంతో ఈశాన్య రాష్ట్రాల్లో అత్యధిక వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.