న్యూఢిల్లీ: ఎయిరిండియాకు చెందిన ఐదుగురు పైలెట్లకు కరోనా సోకలేదని అధికారులు స్పష్టం చేశారు. టెస్టింగ్ కిట్స్ లోపాల కారణంగా ఈ పరిస్థితి వచ్చిందని అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

ఎయిరిండియాకు చెందిన ఐదుగురు పైలెట్లకు కరోనా సోకిందని ఈ నెల 10వ తేదీన అధికారులు ప్రకటించారు. వీరిని క్వారంటైన్ కి తరలించారు. పైలెట్లకు నిర్వహించిన పరీక్షల్లో తొలుత పాజిటివ్ వచ్చిందని, ఆ తర్వాత నిర్వహించిన పరీక్షల్లో నెగిటివ్ వచ్చిన విషయాన్ని అధికారులు ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

also read:ఐదుగురు ఎయిరిండియా పైలెట్లకు కరోనా: క్వారంటైన్‌కి తరలింపు

తొలుత వచ్చిన రిపోర్టులు తప్పుడు రిపోర్టులుగా అధికారులు తేల్చి చెప్పారు.దీంతో పైలెట్లు ఊపిరి పీల్చుకొన్నారు. ఆదివారం నాడు పైలెట్లకు పరీక్షలు నిర్వహించిన కిట్స్ ను  పరిశీలిస్తే ఆ కిట్ పాడైనట్టుగా అధికారులు ఆలస్యంగా గుర్తించారు.

ఈ ఐదుగురు పైలెట్లతో పాటు ఇంజనీర్, టెక్నీషీయన్ కు కూడ ఆదివారం నాడు పరీక్షలు నిర్వహించారు. వీరి శాంపిల్స్  ఫలితాలు ఇంకా రావాల్సి ఉంది. కరోనా లేదని తేలడంతో పైలెట్లతో ఆ కుటుంబ సభ్యులు సంతోషాన్ని వ్యక్తం చేశారు.ఈ ఐదుగురు పైలెట్లు ముంబైకి చెందిన వారు.