తిరువనంతపురం: లాక్ డౌన్ సమయంలో చిన్నారులపై అఘాయిత్యాలకు సంబంధించిన కేసులు ఎక్కువగా నమోదయిన నేపథ్యం కేరళ పోలీసులు ఆపరేషన్ పి హంట్ చేపట్టారు. ఈ క్రమంలోనే చిన్నారుల అశ్లీల ఫోటోలు, చైల్డ్ పోర్న్ వీడియోలను షేర్ చేసిన 41మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇలా అరెస్టయిన వారిలో ఐటీతో పాటు ఇతర రంగాల ఉద్యోగులూ వున్నారు. 

లాక్ డౌన్ కారణంగా ప్రజలంతా ఇంట్లోనే వుండటం ఇంటర్నెట్, సోషల్ మీడియా వినియోగం గణనీయంగా పెరిగింది. ఈ నేపథ్యంలోనే పోర్న్ వీడియోలు చూడటం కూడా పెరింగింది. అంతేకాకుండా ఈ సమయంలోనే చిన్నారులపై అత్యాచార కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. దీంతో కేరళ పోలీసులు ప్రత్యేక దర్యాప్తు జరిపింది. 

read more  'వంటలక్క'పై గ్యాంగ్ రేప్: ఆస్పత్రిలో చేర్చి దుండగులు పరార్

రాష్ట్రంలో మొత్తం 362 ప్రాంతాల్లో నిర్వహించిన ఈ దాడుల్లో మొత్తం 268 మందిపై కేసులు నమోదయ్యాయి. ఈ ఆపరేషన్‌లో కంప్యూటర్లు, మొబైల్ ఫోన్లు,హార్డ్ డిస్క్‌లు వంటి ఎలక్ట్రానిక్ పరికరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

ఈ నేపథ్యంలో డార్క్‌నెట్‌ వంటి ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లను ఉపయోగించి పోర్నోగ్రఫీ చిత్రాలను చూడటం, షేర్‌ చేయడం, డౌన్‌లోడ్‌ చేయడం వంటి ఆరోపణలపై నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేరానికి ఐదేళ్ల వరకు జైలు శిక్ష, రూ.10 లక్షల వరకు జరిమానా విధించే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.