ఇంటి దారి పట్టి ప్రమాదాల్లో వలస కూలీల మృతి: మృతుల్లో తల్లీకూతుళ్లు

తమ స్వగ్రామానికి బయలుదేరిన వలస కార్మికులు స్వగ్రామానికి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడ్డారు.ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకొంది.

4 Migrants Headed Home Killed In Accidents Mother-Daughter Among Them


లక్నో: తమ స్వగ్రామానికి బయలుదేరిన వలస కార్మికులు స్వగ్రామానికి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడ్డారు.ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకొంది.

ఓ మహిళ, ఆమె కూతురితో పాటు ఆరుగురు వలస కూలీలు మహారాష్ట్ర నుండి తూర్పు ఉత్తర్ ప్రదేశ్ లోని జౌన్ పూర్ ప్రాంతానికి బయలుదేరారు. సుమారు 1,300 కి.మీ మూడు రోజుల పాటు ఆటోలో ప్రయాణం చేశారు. యూపీలోని ఫతేపూర్ వద్ద వలస కూలీలు ప్రయాణిస్తున్న ఆటోను ఓ లారీ ఈ నెల 11వ తేదీ సాయంత్రం ఢీకొట్టింది. ఈ ఘటన వారి స్వగ్రామానికి సమీపంలో చోటు చేసుకొంది.

మరో రోడ్డుప్రమాదంలో బీహార్ రాష్ట్రానికి చెందిన వలస కూలీ మరణించాడు. మరో వ్యక్తి గాయపడ్డాడు. ఈ ఘటన హర్యానాలో ఇవాళ ఉదయం చోటు చేసుకొంది.మరోవైపు సోమవారం రాత్రి సైకిల్‌ తొక్కుకుంటూ సొంత గ్రామానికి వెళుతున్న 25 ఏళ్ల వలస కార్మికుడు శివకుమార్‌ దాస్‌ రాయ్‌బరేలీలో కారు ఢీకొని చనిపోయాడు.

శివకుమార్ అనే 25 ఏళ్ల వలస కార్మికుడు సైకిల్ పై  ఇతర కూలీలతో కలిసి వెళ్తున్న సమయంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకొంది. యూపీలోని బులంద్షహర్ నుండి బీహార్ కు వెళ్తున్న సమయంలో కారు ఢీకొని చనిపోయారు. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్ కూడ గాయపడ్డాడు.  

also read:ఎయిరిండియా పైలెట్లకు తొలుత పాజిటివ్, ఆ తర్వాత నెగిటివ్: ట్విస్ట్ ఇదీ...

ఇద్దరు వలస కార్మికులు నడుచుకొంటూ తమ స్వగ్రామానికి నడుచుకొంటూ వెళ్తున్న సమయంలో వేగంగా వస్తున్న కారు ఢీకొట్టింది.కార్మికులు తమ రాష్ట్రం బీహార్ ప్రాంతానికి నడుచుకొంటూ వెళ్తున్నారని పోలీసులు తెలిపారు. కారు అతివేగంగా ఉండడం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకొందని పోలీసులు తెలిపారు. డ్రైవర్ తప్పించుకొన్నాడని పోలీసులు చెప్పారు. కారును సీజ్ చేశారు.


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios