మద్యం లో విషం, నలుగురి మృతి, మరో నలుగురి పరిస్థితి విషయం

4 die of suspected poisoning in Sivakasi
Highlights

ఆత్మహత్యా..? హత్యా..?

తమిళనాడులో ఘోరం జరిగింది. విరుదనగర్ జిల్లాకు చెందిన ఎనిమిది మంది స్నేహితులు కలిసి విషపూరిత మద్యం సేవించారు. అయితే ఇంందులో నలుగురు అక్కడిక్కడే చనిపోగా మరో నలుగురు కొన ఊపిరితో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు కింది విధంగా ఉన్నాయి.

విరుదనగర్‌ జిల్లా శివకాశి ప్రశాంతినగర్ లోని ఓ  వైన్ షాప్ లో నలుగురు స్నేహితులు కలిసి ఓ మందు బాటిల్ తీసుకున్నారు. అనంతరం వీరు మరో నలుగురు స్నేహితులతో కలిసి ఓ ఇంట్లో మందు పార్టీ చేసుకున్నారు. అయితే ఈ మద్యం సేవించిన వారు కొద్దిసేపటి తర్వాత తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. నురగ కక్కుకుంటూ నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. 

వీరిని గుర్తించిన స్థానికులు వెంటనే వారిని ఆస్పత్రికి తరలించారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ ఘటనలో   గౌతమ్‌ (15), గణేశన్‌ (22), మహమ్మద్‌ ఇబ్రహీం (22)  మురుగన్‌ (22) లు చనిపోయినట్లు పోలీసులు గుర్తించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న  వారి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. అసలు వీరి మద్యం లోకి విషం ఎలా చేరిందో తెలుసుకోడానికి దర్యాప్తు చేపట్టారు. వీరంటే గిట్టనివారు ఎవరైనా ఈ పని చేశారా లేక బాధితులే ఆత్మహత్యకు పాల్పడిఉంటారా అన్న కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.  

loader