Asianet News TeluguAsianet News Telugu

ఇండియాను వణికిస్తున్న కరోనా: 24 గంటల్లో రికార్డు స్థాయిలో కేసులు,మరణాలు

గత 24 గంటల్లో కొత్తగా 3900 కేసులు నమోదయ్యాయని కేంద్రం ప్రకటించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య  46,433కి చేరుకొందని కేంద్ర ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ ప్రకటించారు.

3900 new COVID19 cases 195 deaths in last 24 hours  highest single day rise  says Health Ministry
Author
New Delhi, First Published May 5, 2020, 5:05 PM IST

న్యూఢిల్లీ: గత 24 గంటల్లో కొత్తగా 3900 కేసులు నమోదయ్యాయని కేంద్రం ప్రకటించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య  46,433కి చేరుకొందని కేంద్ర ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ ప్రకటించారు.

మంగళవారం నాడు సాయంత్రం ఆయన న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. 24 గంటల్లో 105 మంది కరోనాతో మృతి చెందారు. దీంతో దేశంలో మరణించిన వారి సంఖ్య 1,568కి చేరుకొందన్నారు. కరోనా రోగులు కోలుకొన్న రేటు 27.41శాతానికి చేరిందని కేంద్రం తెలిపింది.

ఒక్క రోజులో అత్యధికంగా కేసులు, మరణాలు నమోదు కావడంతో ఇదే అత్యధికమని కేంద్రం తెలిపింది.  విదేశాల్లో చిక్కుకొన్న భారతీయులను మే 7వ తేదీ నుండి రప్పించేందుకు చర్యలు తీసుకొంటున్నట్టుగా ఆయన తెలిపారు.

ప్రతి కార్యాలయంలో శానిటైజర్లు, మాస్కులను ఉద్యోగులకు అందుబాటులో ఉంచాలని కేంద్రం సూచించింది. అంతేకాదు ఉద్యోగుల మధ్య సోషల్ డిస్టెన్స్ ను ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరింది. అంతేకాదు అదే సమయంలో షిప్ట్ ల మధ్య కూడ సరైన వ్యవధిని ఉంచాలని ఆదేశించింది. ప్రతి ఒక్క ఉద్యోగి ఆరోగ్య సేతు యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించింది.

పెళ్లిళ్లకు 50 మందిని మాత్రం అనుమతిస్తున్నట్టుగా కేంద్రం తెలిపింది. అయితే సోషల్ డిస్టెన్స్ ను పాటించాలని సూచించింది. మరో వైపు అంత్యక్రియల్లో పాల్గొనేందుకు 20 మందిని అనుమతిస్తున్నట్టుగా కేంద్రం తెలిపింది. 

also read:మద్యం ప్రియులకు బంపరాఫర్: లిక్కర్ డోర్ డెలీవరి

కొన్ని రాష్ట్రాల నుండి కేసులు, మరణాల సమాచార సరైన సమయంలో అందడం లేదని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. వలస కూలీలను తమ స్వంత రాష్ట్రాలకు తరలించే ప్రక్రియ కొనసాగుతోందని కేంద్రం తెలిపింది. ఇవాళ 21 రైళ్లు ఆయా రాష్ట్రాల నుండి కూలీలను తమ ప్రాంతాలకు తరలించాయని ప్రకటించింది.

Follow Us:
Download App:
  • android
  • ios