మద్యం ప్రియులకు బంపరాఫర్: లిక్కర్ డోర్ డెలీవరి
ఛత్తీస్ ఘడ్ ప్రభుత్వం మద్యం ప్రియులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇంటి వద్దకే మద్యం సరఫరా చేస్తామని ప్రకటించింది. ఈ మేరకు మద్యం సరఫరా ఆర్డర్ల కోసం వెబ్ సైట్ ను మంగళవారం నాడు ప్రారంభించింది. రాష్ట్రంలోని గ్రీన్ జోన్లలో నేరుగా ఇంటికే మద్యం సరఫరా చేయనుంది.
రాయ్‌పూర్: ఛత్తీస్ ఘడ్ ప్రభుత్వం మద్యం ప్రియులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇంటి వద్దకే మద్యం సరఫరా చేస్తామని ప్రకటించింది. ఈ మేరకు మద్యం సరఫరా ఆర్డర్ల కోసం వెబ్ సైట్ ను మంగళవారం నాడు ప్రారంభించింది. రాష్ట్రంలోని గ్రీన్ జోన్లలో నేరుగా ఇంటికే మద్యం సరఫరా చేయనుంది.
ఛత్తీస్‌ఘడ్ స్టేట్ మార్కెటింగ్ కార్పోరేషన్ లిమిటెడ్(సీఎస్ఎంసీఎల్) పేరుతో ఈ వెబ్ సైట్ ను ప్రారంభించింది ఆ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ. ఈ ప్రక్రియ ద్వారా మద్యం అమ్మకాలను నియంత్రించే అవకాశం ఉందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.లాక్ డౌన్ నేపథ్యంలో ఈ ఏడాది మార్చి 23వ తేదీ నుండి మద్యం దుకాణాలను మూసివేశారు.
రాష్ట్రంలో నిన్ననే మద్యం విక్రయాలు ప్రారంభమయ్యాయి. మద్యం విక్రయాలు ప్రారంభం కావడంతో రాయ్ పూర్ తో పాటు పలు జిల్లాల్లో మద్యం దుకాణాల వద్ద సోషల్ డిస్టెన్స్ ను పాటించని విషయాన్ని అధికారులు గుర్తించారు.
మద్యం దుకాణాల వద్ద జనం బారులు తీరకుండా ఉండేందుకు వీలుగా ఆన్ లైన్ లో మద్యం డెలీవరి పద్దతిని ప్రారంభించినట్టుగా ఛత్తీస్ ఘడ్ అధికారులు ప్రకటించారు.
also read:లాక్‌డౌన్ దెబ్బ: 8 లక్షల లీటర్ల బీరు డ్రైనేజీలోకి
మద్యం కావాల్సిన వారు సీఎస్ఎంసీఎల్ వెబ్ సైట్ తో పాటు ఇదే మొబైల్ యాప్ ద్వారా కూడ ఆర్డర్ చేసుకోవచ్చని ప్రభుత్వం ప్రకటించింది. గ్రీన్ జోన్లుగా లేని రాయ్ పూర్, కోబ్రా జిల్లాలకు ఆన్ లైన్ లో మద్యం సరఫరా ఉండదని అధికారులు తేల్చారు.
మొబైల్ నెంబర్, ఆధార్ నెంబర్, తమ ఇంటి అడ్రస్ ను ఇవ్వడం ద్వారా మద్యం కొనుగోలుకు ఆర్డర్ చేసుకోవాలని ప్రభుత్వం తెలిపింది.రిజిస్టర్ చేసుకొన్న మొబైల్ నెంబర్ కు ఓటీపీ నెంబర్ వస్తే ఆన్ లైన్ ఆర్డర్ పూర్తైనట్టేనని ప్రభుత్వం ప్రకటించింది.
ఒక్క వినియోగదారుడు 5 వేల మి.లీ. మద్యం ఆన్ లైన్ లో ఆర్డర్ చేసుకోనేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇంటికి నేరుగా మద్యం సరఫరా చేసినందుకు రూ. 120 అదనంగా వసూలు చేయనున్నారు. మద్యం డోర్ డెలీవరీ చేయడాన్ని ప్రధాన ప్రతిపక్షం బీజేపీ తప్పుబట్టింది.