భారతదేశం ప్రపంచానికి అందించిన అపూర్వ వరం యోగా. దీనిని అభ్యసించేందుకు ప్రపంచ నలుమూలల నుంచి భారత్‌కు వస్తున్నారు. ఈ క్రమంలో యోగా నేర్చుకోవటానికి వచ్చిన ఓ జపాన్ మహిళపై ముగ్గురు యోగా గురువులు లైంగిక వేధింపులకు పాల్పడి కటకటాల పాలయ్యారు.

వివరాల్లోకి వెళితే.. జపాన్‌కు చెందిన ఉత్తరాఖండ్‌లోని రిషీకేశ్‌లో ఉంటూ అక్కడి ఆమ్‌బాగ్ ఏరియాలోని యోగా స్కూల్‌లో యోగా నేర్చుకుంటోంది. ఈ నేపథ్యంలో అదే స్కూల్‌లో పనిచేస్తున్న  ముగ్గురు గురువులు హరికృష్ణ, చంద్రకాంత్, సోమ్‌రాజ్‌లు ఆమెపై కన్నేశారు.

అప్పటి నుంచి తరచు ఆమెను లైంగికంగా వేధించేవారు. తమ కోరిక తీర్చాలంటూ రోజూ ఒత్తిడి తెచ్చేవారు. వీరి వేధింపులు భరించలేకపోయిన ఆ మహిళ శనివారం ముని కీ రేతి పోలీస్ స్టేషన్‌లో వారిపై ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను ఆదివారం అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు.

Also Read:

ఇదీ జరిగింది: యువతిపై వృద్దుడి అత్యాచారం, సెల్ లో చిత్రీకరించిన ప్రియుడు

విద్యార్థినిపై అత్యాచారం.. ఎవరికైనా చెప్తే చంపేస్తానంటూ...