ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ ఉగ్రరూపం దాల్చిన నేపథ్యంలో దేశాలకు దేశాలే లాక్‌డౌన్‌లోకి వెళ్లిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ దీని దాటికి వేలాదిమంది ప్రాణాలు కోల్పోతున్నారు.

అంతర్జాతీయ సర్వీసులు నిలిపోతుండటం, కఠిన ఆంక్షల నేపథ్యంలో వివిధ దేశాల్లో భారతీయులు చిక్కుకుపోయి సాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇరాన్‌లో చిక్కుకుపోయిన భారతీయులను ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం విడతల వారీగా స్వదేశానికి తీసుకొచ్చింది.

Also Read:కమల్‌నాథ్ ప్రె‌స్ మీట్‌కు వచ్చిన జర్నలిస్ట్‌కు కరోనా: అధికారుల్లో టెన్షన్

తాజాగా బుధవారం ఉదయం మరో 277 మందిని భారతదేశానికి తీసుకొచ్చింది. వీరిలో 128 మంది పురుషులు, 149 మంది మహిళలు ఉన్నారు. బుధవారం రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ విమానాశ్రయానికి చేరుకున్న వీరికి అక్కడే వైద్య పరీక్షలు నిర్వహించిన అధికారులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆర్మీ వెల్‌నెస్ కేంద్రానికి తరలించారు.

వీరందరినీ అక్కడే ప్రత్యేక పరిశీలనలో ఉంచుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు. వీరి కోసం అన్ని వైద్యసదుపాయాలను ఏర్పాటు చేశామని, ఎప్పటికప్పుడు అధికారులతో సమాచారాన్ని పంచుకంటున్నట్లు ఆర్మీ అధికారులు వెల్లడించారు.

Also Read:దేశంలో కరోనా కేసుల సంఖ్య 566: రాష్ట్రాల వారీగా తాజా లెక్కలు ఇవీ..

మరోవైపు ఇరాన్‌లో గత 24 గంటల్లో 143 మంది వైరస్ కారణంగా మరణించారు. దీంతో ఆ దేశంలో కరోనా మరణాల సంఖ్య 2,077కి చేరింది. ఇప్పటికే ఇరాన్‌లో 27 వేల పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఆ దేశ ఆరోగ్య శాఖ ప్రకటించింది.