దేశంలో కరోనా కేసుల సంఖ్య 566: రాష్ట్రాల వారీగా తాజా లెక్కలు ఇవీ...
దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 566కు చేరుకుంది. తాజాగా తమిళనాడులో ఓ కరోనా మరణం సంభవించడంతో మరణాల సంఖ్య 11కు చేరుకుంది. మహారాష్ట్రలో అత్యధిక కేసులు నమోదయ్యాయి.
న్యూఢిల్లీ: దేశంలో 566 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. భారతదేశంలో మరో కరోనా మరణం నమోదైంది. దీంతో దేశంలో కరోనా మృతుల సంఖ్య 11కు చేరుకుంది. తమిళనాడులో 54 వ్యక్తి కరోనా సోకి మరణించాడు. తమిళనాడులో తొలి కరోనా మరణం రికార్డయిందని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సి. విజయభాస్కర్ చెప్పారు. రాష్ట్రాల వారీగా కరోనా వైరస్ కేసుల సంఖ్య ఇలా ఉంది.
కరోనా కేసుల సంఖ్య 536
మరణాలు 11
మహారాష్ట్ర 106, మరణాలు 3
కేరళ 95
ఢిల్లీ 31, మరణాలు 1
గుజారత్ 29, మరణాలు 1
తెలంగాణ 39
ఆంధ్రప్రదేశ్ 8
కర్ణాటక 37
బీహార్ 2, మరణాలు 1
రాజస్థాన్ 33
పంజాబ్ 29, మరణాలు 1
పశ్చిమ బెంగాల్ 8, మరణాలు 1
ఉత్తరప్రదేశ్ 33
చత్తీస్ గడ్ 1
హర్యానా 26
హిమాచల్ ప్రదేశ్ 3, మరణాలు 1
మధ్య ప్రదేశ్ 7
ఒడిశా 2
తమిళనాడు 18, మరణాలు 1
జమ్మూ కాశ్మీర్ 4
లడక్ 13
ఉత్తరాఖండ్ 3
మంగళవారంనాడు మహారాష్ట్ర రాజధాని ముంబైలో 65 ఏళ్ల వృద్ధుడు మరణించాడు. సోమవారంనాడు ముంబైలోని కస్బూర్బా ఆస్పత్రిలో చేరిన అతను మంగళవారం మృత్యువాత పడ్డాడు. ఆస్పత్రిలో చేరిన కొద్ది గంటలకే అతను తుదిశ్వాస విడిచాడు.
మృతుడు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి మార్చి 15వ తేదీన అహ్మదాబాద్ వచ్చాడు. అక్కడి నుంచి 20వ తేదీన ముంబై చేరుకున్నాడు. దగ్గు, జ్వరం రావడంతో సోమవారం ఆస్పత్రిలో చేరాడు.
మహారాష్ట్ర ముగ్గురు, కర్ణాటకలో ఒకరు, బీహార్ లో ఒకరు, పంజాబ్ లో ఒకరు, పశ్చిమ బెంగాల్ లో ఒకరు, హిమాచల్ ప్రదేశ్ లో ఒకరు, గుజరాత్ లో ఒకరు, ఢిల్లీలో ఒకరు కరోనా వైరస్ బారిన పడి మరణించారు.