న్యూఢిల్లీ: విదేశాల్లో ఉన్న 276 మంది భారతీయులకు కూడ కరోనా సోకినట్టుగా భారత విదేశాంగ శాఖ ప్రకటించింది. వీరిలో 255 మంది ఇరాన్‌లో ఉన్నవారేనని కేంద్రం స్పష్టం చేసింది. 

Also read:సెలవులు రద్దు, ఆరు కరోనా పాజిటివ్ కేసులు: ఈటల రాజేందర్

ఇటలీ, యూఏఈ, కువైట్, హాంకాంగ్, కువైట్, రువాండా, శ్రీలంక  దేశాల్లో ఉన్న  భారతీయులకు ఈ వ్యాధి సోకినట్టుగా భారత ప్రభుత్వం తెలిపింది.మరోవైపు ఇండియాలో 150 మందికి కరోనా వ్యాధి నిర్ధారణ అయినట్టుగా కేంద్రం ప్రకటించింది.. కరోనా వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ  హెచ్చరించింది.

కరోనాను మహమ్మారిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.  కరోనా విషయంలో అలసత్వం వహించకూడదని కేంద్రం కూడ ఆయా రాష్ట్రాలను హెచ్చరించింది. కరోనా విషయమై ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వం లిఖితపూర్వకంగా ఈ సమాధానాన్ని ఇచ్చింది.