సారాంశం

ఐఐఎం సెకండ్ ఇయర్ చదువుతున్న ఓ విద్యార్థి ఆకస్మికంగా గుండెపోటుతో మృతి చెందాడు. 

బెంగళూరు : బెంగళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం)లో చదువుతున్న 27 ఏళ్ల విద్యార్థి ఆదివారం గుండెపోటుతో మరణించాడు. ఐఐఎం బెంగళూరు తెలిపిన వివరాల ప్రకారం... ఆ విద్యార్థి పేరు ఆయుష్ గుప్తా. మేనేజ్‌మెంట్ కోర్సులో పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ రెండవ సంవత్సరం చదువుతున్నాడు. సమ్మర్ వెకేషన్ ఫేరింగ్ క్యాపిటల్‌లో శిక్షణ పొందాడని పేర్కొంది.

"ఈ మధ్యాహ్నం మా రెండవ సంవత్సరం పిజీపి విద్యార్థి ఆయుష్ గుప్తా గుండెపోటుతో బాధపడుతూ మృతి చెందడం మాకు చాలా బాధ కలిగించింది. ఆయుష్ (27) పీజీపీ విద్యార్థి పూర్వ విద్యార్థుల కమిటీకి సీనియర్ కోఆర్డినేటర్" అని ఇన్స్టిట్యూట్ సోషల్ మీడియాలో పేర్కొంది. 

పార్లమెంట్ ఆవరణలో రాఘవ్ చద్దా తలపై తన్నిన కాని.. ఫొటో వైరల్.. బీజేపీ సెటైర్లు..

సోషల్ మీడియా పోస్ట్‌ల ప్రకారం, ఆయుష్ ఎంబీఏ చదువుతున్నాడు. ఫెరింగ్ క్యాపిటల్‌లో సమ్మర్ ఇంటర్న్‌షిప్‌తో పాటు, అతను ఇన్‌స్టిట్యూట్ పూర్వ విద్యార్థులతో కలిసి పనిచేశాడు.  2017లో బిట్స్ పిలానీ నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. ఐఐఎంబీ సంఘం ఆయుష్ కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది. 

మరోవైపు ఐఐఎంబీ బెంగళూరు కూడా లింక్డ్‌ఇన్‌లో గుప్తా మరణ వార్తనుషేర్ చేసింది. అతనిమరణ వార్త మీద లింక్డిన్ యూజర్ ఒకరు..."ఈ ఫొటోలో కనిపిస్తున్న చిరునవ్వు అతని సంతకం. ఆయుష్‌ను మరచిపోవడం చాలా కష్టం - వ్యాపార ప్రపంచంలో తనదైన ముద్ర వేసేవాడు. ఇప్పుడతన్ని మరచిపోవడం కూడా కష్టం. కూల్ గా ఉండే అతని స్వభావంతో పాటు అనేక అద్భుతమైన వ్యక్తిత్వం మళ్లీ నాకు దొరకవు" అని చెప్పుకొచ్చారు. 

అతని మరణవార్త అందరన్నీ కలిచివేసింది.. మరొకరు మాట్లాడుతూ.. ‘27యేళ్లకే అతను తన జీవితాన్ని ముగించాడు. హ్యాపీ సోల్.. బతికుంటే భవిష్యత్తులో ఒక మార్పును తీసుకువచ్చేవాడని అన్నారు. 

మరొకరు ఇలా వ్యాఖ్యానించారు.. "విషాదం,  హృదయ విదారకమైనది! నాకు తెలిసిన అత్యంత ప్రతిభావంతుడు, ఉత్సాహవంతుడు అతను" అన్నారు. "నేను కలుసుకున్న అత్యంత ఉల్లాసవంతమైన, పాజిటివ్, ఉత్సుకత ఉన్న వ్యక్తి ఆయుష్‌. అతని ఆత్మకు శాంతి కలగాలి..’ అని రాసుకొచ్చారు.