బెంగళూరులో దారుణం జరిగింది. స్నేహితుని పుట్టినరోజు వేడుకలకు హాజరైన ఓ వ్యక్తి.. అతని భార్యపై అత్యాచారానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే.. నీలభ్ నయన్ అనే 26 ఏళ్ల వ్యక్తి ఎలక్ట్రానిక్ సిటీలోని ఐటీ మేజర్ అనే సాఫ్ట్‌వేర్ కంపెనీలో సొల్యూషన్స్ మేనేజ్‌మెంట్ కన్సల్టెంట్‌గా పనిచేస్తున్నాడు.

నగరానికి చెందిన 24 ఏళ్ల మహిళ ఒక టెక్కీని వివాహం చేసుకుంది. ఈ క్రమంలో గత ఆదివారం తన భర్త పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరపాలని నిర్ణయించుకుంది. దీనిలో భాగంగా కసవనహళ్లీలోని స్పోర్ట్స్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ సెంటర్‌కు వెళ్లారు. అక్కడికి భర్త స్నేహితులైన నీలభ్‌తో పాటు మరో నలుగురు వచ్చారు.

Also Read:భక్తురాలిపై ఆలయ పూజారి అఘాయిత్యం

ఆ సెంటర్‌లో పార్టీ ముగిసిన తర్వాత మరో స్నేహితుడి ఇంట్లో బర్త్‌డే బాష్‌ను కొనసాగించడానికి వెళ్లారు. స్పోర్ట్స్ సెంటర్‌లో అనేక ఆటలు ఆడినందున అలసిపోయిన బాధితురాలు స్నేహితుని ఇంట్లో విశ్రాంతి తీసుకునేందుకు బెడ్‌రూమ్‌లోకి వెళ్లింది.

అదే సమయంలో ఆమె భర్త, అతని మిత్రులు బాల్కానీలో కబుర్లు చెప్పుకుంటున్నారు. ఈ క్రమంలో చీకటిగా ఉన్న బెడ్‌రూమ్‌లోకి ఓ వ్యక్తి వచ్చి వివాహితను గట్టిగా హత్తుకుని, దుస్తులు విప్పేశాడని, అనంతరం ఆమెపై లైంగిక దాడి చేయడానికి ప్రయత్నించాడు.

ఆ వ్యక్తి తన భర్త కాదని గ్రహించిన బాధితురాలు పడకగదిలో ఉన్న అలారంను మోగించేందుకు ప్రయత్నించింది. అయితే నీలభ్ అతని చేత్తో బాధితురాలి నోరు కప్పి ఆమెపై లైంగిక దాడి చేస్తూనే ఉండటంతో బాధితురాలు సాయం కోసం గట్టిగా కేకలు వేసింది.

చేసేది లేక వివాహిత నయన్‌ను గట్టిగా కొట్టింది. అతని బారి నుంచి ఎలాగోలా తప్పించుకున్న బాధితురాలు గట్టిగా కేకలు వేస్తుండటంతో ఆమె భర్తతో పాటు మిగిలిన స్నేహితులు బెడ్‌రూమ్‌ వైపు వచ్చారు.

లోపలి వైపు నుంచి గడియ పెట్టి ఉండటంతో తలుపులు బద్ధలు కొట్టి చూడగా.. నీలభ్ బాత్‌రూమ్‌లోకి పరిగెత్తగా, బాధితురాలు నగ్నంగా కనిపించింది. ఏం జరిగిందో తెలుసుకునే లోపు నీలభ్ అక్కడి నుంచి పారిపోయాడు. మిత్రులతో కబుర్లు చెబుతున్న నీలభ్ బాత్‌రూమ్‌కి వెళ్లొస్తానంటూ మధ్యలోనే వచ్చేశాడు.

Also read:కొమరం భీమ్ జిల్లాలో మహిళపై గ్యాంగ్‌రేప్, హత్య

బెడ్‌రూమ్‌కి ఉన్న ఎటాచ్డ్ బాత్‌రూమ్‌లోకి వెళుతూ మంచంపై పడివున్న వివాహితపై కన్నేసి ఆమెను అనుభవించాలని భావించాడని పోలీసులు తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నీలభ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు వైద్య పరీక్షల అనంతరం సోమవారం కోర్టులో హాజరుపరిచారు.